
Magistrate and Tehsildar Ramesh
తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన యూఎస్పీసి.
మల్లాపూర్ జులై 23 నేటి ధాత్రి
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల మేజిస్ట్రేట్, తహసీల్దార్ రమేష్ కు మండల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన పాఠశాల ల విద్యా, ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యల పరిష్కరం కోరకు ఉద్యమంలో మొదటి దశలో భాగంగా తహసీల్దార్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో టీపీటీఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యప్రకాష్, టిఎస్ యూటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి భూమేశ్వర్, టిఫిటీ ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి లావుద్య రాజయ్య, యూటీఫ్ మండల అధ్యక్షులు బబ్బురి రాజేందర్, జంగా గంగాధర్, డిటిఎఫ్ మండల బాద్యులు ముజబీర్, మొలుగూరి నరేష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘం బాద్యులు జరుపుల సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.