కాటారం నేటి ధాత్రి
ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని
సద్వినియోగం చేసుకోవాలని శంకరంపల్లి సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్ కోరారు. మండలం లో శంకరంపల్లి గ్రామ పంచాయతీలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్ ప్రారంభించారు .
గ్రామ ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఎంపిటిసి బండం రాజమణి మాట్లాడుతూ గ్రామ ప్రజలకి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. శంకరపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన యువత అందరు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోవాలని ఎంపిటిసి రాజమణి కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పోతే సంతోష్, కోటపర్తి శ్రీను, కంటి వెలుగు వైద్యాధికారి డాక్టర్ వంశీ కృష్ణ, పారా మెడికల్ ఆప్తాలమిక్ అధికారి బి లింగమూర్తి, డేటా ఎంట్రీ ఆపరేటర్ టి మధుసూధన్, హెల్త్ సూపర్ వైజర్ సాంబయ్య, ఏఎన్ఎం సునీత, నాగరాణి ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.