పరకాల సీఐ రవిరాజు
పరకాల నేటిధాత్రి
వరంగల్ పోలీస్ మరియు టీఎంఐ ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఉచిత జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రవిరాజా తెలిపారు.3000లకు పైగా ఉద్యోగాలు 15కు పైగా సంస్థలు నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్,రైజ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్,ఐ ప్రాసెస్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ,రిలయన్స్ జియో లాంటి మరిన్ని సంస్థలు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నాయని 10వ తరగతి నుండి పీజీ పూర్తయినా వారు ఈ జాబ్ మేళాను పరకాల పట్టణ మరియు మండల నిరుద్యోగులు విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సిఐ రవిరాజా అన్నారు.పాల్గొనే ముందుగా యువత bit.ly/jmform సైట్ లో నమోదు చేసుకోవాలని అన్నారు.