గణపతి నిమర్జనోత్సవానికి డి జే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం

మరిపెడ/సిరోలు నేటి ధాత్రి.

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జనం కు వెళుతున్న క్రమంలో ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవం నిర్వహించుకోవాలని సీరోలు ఎస్ఐ. యం.రమాదేవి అన్నారు, డి జే సౌండ్ సిస్టం వినియోగించినటువంటి వారిపై కేసు నమోదు చేసి డి జే సౌండ్ సిస్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం జరుగుతుంది అన్నారు,ఎవరైనా నిమర్జనం ఉత్సవాలలో డి జే సౌండ్ సిస్టం వాడినా, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొన్నా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు,నిమజ్జన సమయంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోగలరు,మీ యొక్క విగ్రహాలను వీలైనంత తొందరగా నిమజ్జనం కొరకు చెరువు వద్దకు తీసుకొని వెళ్ళగలరు అని నిమర్జనం ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే
డయల్ -100, లేదా 8712656995, 8712656996 సమాచారం అందజేయగలరు అన్నారు,కావున ప్రజలందరూ గణపతి నిమర్జన ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో ప్రశాంతంమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!