108 సేవలు సద్వినియోగం చేసుకోవాలి
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రజలు 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ 108 కో ఆర్డినేటర్ రవి కుమార్ నిజాంపేట లో గల అంబులెన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లో గల పరికరాలు, మందు నిల్వలను పరిశీలించారు. రోడ్డు ప్రమాద సమయం లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఏదైనా అత్యవసర సమయంలో ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. సిబ్బంది పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈఎంటీ స్వామి, పైలెట్ సురేష్ ఉన్నారు.
