
Urea Shortage Plagues Nizampet Farmers.
నిజాంపేటలో..
వెంటాడుతున్న యూరియా కష్టాలు..
నిజాంపేట: నేటి ధాత్రి
యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ లో యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ యూరియా పంపిణీలో రైతులు అధిక సంఖ్యలో టోకెన్ తీసుకొని క్యూ లైన్ లో ఉదయం నుండి వేచి ఉండగా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలో క్రితం వర్షాలు లేక వర్షాలకు ఏడిస్తే.. ఇప్పుడు వర్షాలు సంమృద్ధిగా కురిసినప్పటికీ యూరియా కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి యూరియా చల్లకపోతే.. వేసిన పంట ఎదుగుదల నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని వేడుకుంటున్నారు.