
Rythu Seva Kendra.
గ్రోస్ రైతు సేవ కేంద్రంలో యూరియా
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో 20 మెట్రిక్ టన్నులు,నడికూడ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో 2 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో కలదు.
యూరియా కావలసిన రైతులు ఆధార్ మరియు పట్టా పాస్ పుస్తకం సమర్పించి పొందగలరు.
ప్రస్తుతం మండలంలో పత్తి పంట 8500 ఎకరాలలో సాగు అవుతున్నది వరి నాట్లు ఇప్పటివరకు 1200 ఎకరాలలో వేసినట్లు అంచనా.
ముఖ్యంగా పత్తి పంట 30-40 రోజుల శాఖియ దశలో ఉన్నది కాబట్టి రైతు సోదరులు సాంప్రదాయ యూరియాకు బదులుగా ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను పత్తిలో పిచికారి చేసుకోవలసిందిగా కోరుచున్నాము.
నానో యూరియా వల్ల లాభాలు
నానో యూరియా అనేది ద్రవ రూపంలో ఉండే ఎరువు.ఇది మొక్కలకు చాలా మొత్తంలో అవసరమైన పోషకాలను అందిస్తుంది.సాంప్రదాయ యూరియా (గ్రాన్యులర్ యూరియా)తో పోలిస్తే,నానో యూరియాకు అనేక లాభాలున్నాయి.
నానో యూరియాను ఆకులపై పిచికారీ చేయడం వల్ల, మొక్కలు పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తాయి.దీనివల్ల పంట దిగుబడి 2-4% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.
సాంప్రదాయ యూరియాలో దాదాపు 20-30% నత్రజని ఆవిరైపోతుంది లేదా లీచ్ అవుతుంది.నానో యూరియాలో ఈ నష్టం చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది నేరుగా మొక్కల ఆకుల ద్వారా శోషించబడుతుంది.దీంతో, తక్కువ యూరియాతోనే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
తక్కువ మొత్తంలో యూరియా వాడటం వల్ల భూగర్భ జలాల్లోకి నత్రజని చేరడం తగ్గుతుంది.ఇది పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది.
నానో యూరియా తక్కువ పరిమాణంలో అవసరం కాబట్టి,రవాణా,నిల్వ ఖర్చులు తగ్గుతాయి.అలాగే, తక్కువ ఎరువును వాడటం వల్ల రైతులకు డబ్బు ఆదా అవుతుంది.
నానో యూరియా వాడకం వల్ల పంటల నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగు గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగుచేయదలచిన మండలంలోని రైతు సోదరులు పూర్తి వివరాలకు సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించవలసినదిగా కోరుచున్నాను.
నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పోరిక జై సింగ్ తో పాటుగా వ్యవసాయ విస్తరణ అధికారి జనగం ప్రదీప్,రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.