
Sanitation Issues in Bhupalpally Need Urgent Action
పట్టణ పారిశుద్య సమస్యలను పరిష్కరించాలి.
జాతీయ మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోనీ పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి.పలు కాలనీలలో సమస్యలు కంపు కొడుతున్న మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదని జాతీయ మాన హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య హాజరై మాట్లాడడం జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని విలీన గ్రామాలైనటువంటి జంగేడు,కాసింపల్లి, వేషాలపల్లి ,పుల్లూరి రామయ్యపల్లి ,కుందూరు పల్లి పెద్దకుంటపల్లి, గ్రామాలలో పారిశుధ్య పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నా చందాగా ఉన్నాయని అన్నారు . కాలనిలలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో నిండిపోయిన అధికారులు మొద్దు నిద్ర పోవడం సరైనటువంటి పద్ధతి కాదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సరైనటువంటి సిబ్బంది లేక సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చెత్తను తీసుకుపోయేటువంటి చెత్త బండ్లు, ట్రాక్టర్లు చిన్నచిన్న రిపేర్లు ఉంటే వాటిని రిపేర్లు చేయించకుండా పక్కన పెట్టడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని పేర్కొన్నారు. వాహనాలను పక్కన పెట్టడం ద్వారా తుప్పు పట్టి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని వెంటనే రిపేర్ లో ఉన్నటువంటి వాహనాలను తొందరగా రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకురావాలి అని కోరారు. గ్రామాలలో మహిళలు ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమాల ప్రాంగణాలను ముందస్తుగానే ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా 30 వార్డులకు సరిపోయేంత పారిశుద్ధ్య కార్మికులు లేరని కొత్తవారిని నియమించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం లోపించడం వలన , కాల్వలలో బ్లీచింగ్ చల్లకపోవడం ,దోమల మందు ఫ్యాగింగ్ చేయకపోవడం వలన,కాలనీలలో కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాలకు బలవుతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే కాలనీ సమస్యలను పరిష్కరించాలని దీనిపైన జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంత్రి రాకేష్ ,సోషల్ మీడియా కన్వీనర్ అమృత అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు సంగం రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి జోగుల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి శీలపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.