# సిఆర్పిఎఫ్, పిఓడబ్ల్యు ఎంవిఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.
హైదరాబాద్, నేటిధాత్రి :
వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పెట్ మండల కేంద్రంలో గల అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మెరుగైన వసతులు కల్పించి హాస్టల్ నిర్లక్ష్యానికి కారణమైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఆర్పిఎఫ్, పిఓడబ్ల్యు,ఏఐకేఎంఎస్, ఎంవిఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, మరియు సిడబ్ల్యుసి లకు వినతి పత్రాలను సమర్పించారు. వెంటనే కలెక్టర్ స్పందిస్తూ విచారణ చేపడతామని ప్రజా సంఘాల బృందం సభ్యులకు హామీ ఇచ్చారు. సిడబ్ల్యుసి స్పందిస్తూ హాస్టల్ లో నెలకొన్న సమస్యల పైన పూర్తి విచారణకు కమిటీని వేస్తున్నట్లు తెలియజేశారు.ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్, పిఓడబ్ల్యు ఎంవిఎఫ్ ప్రజా సంఘాల నాయకులు సిఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షులు శివరాజ్ , పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి వై గీత, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ హాస్టల్ అద్వాన పరిస్థితుల పట్ల సరైన సమగ్ర విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హాస్టల్ ను వికారాబాద్ జిల్లా కేంద్రంలోకి మార్చాలని అన్నారు. జిల్లాలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యం కావడానికి పూర్తిగా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే సమస్యల పైన స్పందించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారుల పైన చర్యలు లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్, పిఓడబ్ల్యు,ఏఐకేఎంఎస్, ఎంవిఎఫ్ ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాస్,వెంకటయ్య, రాములు, ఆశ ఉమా, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.