
Warangal Urban Cooperative Bank on Growth Path
అభివృద్ధి పథంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్
_చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు.
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. శుక్రవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ప్రగతిని వివరించారు. 1995లో ప్రారంభమైనప్పటి నుండి ఎదురైన సవాళ్లను అధిగమించి బ్యాంకును దినదినాభివృద్ధి చేసుకుంటూ వచ్చామని తెలిపారు. మొదట 5 కోట్లతో ప్రారంభమైన ఈ బ్యాంక్ ప్రస్తుతం 400 కోట్ల టర్నోవర్‌తో ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 10శాఖలను ఏర్పాటు చేశామని, వచ్చే 5 సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంక్ శాఖలను విస్తరించాలని సంకల్పించామని చెప్పారు.
“రాజకీయాలకు అతీతంగా సహకార స్ఫూర్తితో అభివృద్ధి చేస్తాము. బ్యాంక్‌తో రాజకీయం చేయకండి. 6 సార్లు గెలిచి సేవ చేసే అవకాశం కలిగింది. ఓడిపోయిన వారినీ కలుపుకొని ముందుకు వెళ్తాం” అని ప్రదీప్ రావు పేర్కొన్నారు.
వ్యాపార వర్గాలను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయనివ్వమని, మహిళలకు కూడా రుణాలు అందించే దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను మరింత విస్తరిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు