ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
శుక్రవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాబా నగర్ లో 17 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, వాటర్ వర్క్ ఏ ఈ
వేణు గోపాల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దయాకర్ రెడ్డి, ప్రవీణ్, వాసు, మూర్తి, గౌసు తదితరులు పాల్గొన్నారు.