ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 15
నాచారం 80 లక్షల రూపాయల వ్యయంతో కార్తికేయ నగర్ ప్రధాన రోడ్డుపై ఉన్న పెద్ద నాలాపై కొత్త బ్రిడ్జి నిర్మాణము పనులు పూర్తయిన తర్వాత ఈరోజు శుక్రవారం ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్ తో కలిసి ప్రారంభించారు.
కార్తికేయ నగర్ ప్రధాన రోడ్డులో ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినందున అంబేద్కర్ స్టాచు వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు తొందర్లోనే ప్రారంభిస్తామని దానికి కావలసిన 94 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి టెండర్ కూడా అయింది అని కార్పొరేటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ లింగారావు వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ నాచారం డివిజన్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు కార్తికేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు