Uppal MLA Bandari Lakshmareddy at Christmas Celebrations
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్
కాప్రా నేటిధాత్రి
మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చ్ నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, గొల్లురీ అంజయ్య , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి జంపాల్ రెడ్డి , పాస్టర్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
