ఉద్యమకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ
కేసముద్రం/ నేటి ధాత్రి
ఈనెల 21 వ తేదీన హైదరాబాద్ లో జరుగబోయే ఉద్యమకారుల ప్లీనరీ కి ఉద్యమకారులందరూ హాజరు కావాలని కోరుతూ కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం కేసముద్రం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి.సి.సి. సభ్యులు గుగులోత్ దస్రూ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులందరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు చాగంటి కిషన్ మాట్లాడుతూ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, 10 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని, ఉద్యమకారులందరికీ మండల కేంద్రంలో నివాస స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని నెరకు 25000 పింఛను ఇవ్వాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యమకారుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, కోశాధికారి దామరకొండ ప్రవీణ్ కుమార్, కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ భట్టు శీను, విద్యార్థి, యువజన జెఎసి పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, కొలిపాక వెంకన్న, చిట్యాల వీరన్న, బాలు మోహన్, వేం నరసింహారెడ్డి, సోమారపు వెంకటయ్య, జనిగల పరమేశ్వర్, మాందాటి ఆంజనేయులు, షేక్ యాకుబ్ అలీ, గుగులోత్ సునీత, నాగరబోయిన చంద్రకళ పాల్గొన్నారు.