రోడ్డు కొట్టుకుపోయిన స్పందించని అధికారులు

రోడ్డు ఇలా…..ప్రయాణం ఎలా

అవస్థల పాలవుతున్న ప్రజలు

శాయంపేట నేటి ధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్ద కోడెపాక గ్రామం నుండి పరకాలకు వెళ్లే మార్గంలో భారీ వర్షాలకు గండిపడి కొట్టుకొని పోయి చాలాకాలం అవు తుంది. రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అధిక వర్షాలుపడే అవకాశం ఉన్నం దున ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాహన దారులు ఇబ్బంది కలగడంతో ఈరోడ్డు విషయానికి వస్తే గుంతల మయం వాహన దారులు ఈ రోడ్డు మార్గంలో పోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సింది వస్తుంది.పెద్ద కోడేపాక గ్రామం నుండి పరకాలకు వెళ్లే రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలు మాత్రమే దర్శన మిస్తాయి. దీనితో ప్రయాణికులు వానదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు గత వర్షాకాలంలో అధిక వర్షాలకు నువ్వులకుంట రోడ్డు గండిపడడం ఈ మార్గం గుండా వాహనదారులు జారిపడి చాలా ప్రమాదాలు జరిగాయని ప్రజలు తెలుపుతున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రతి వానకాలం తిప్పలే

వర్షాకాలంలో నవ్వులకుంట ఉప్పొంగితే రాకపోకలు నిలిచిపోతాయి. గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. దీని అవతల వైపున రైతుల వ్యవసాయ భూములు వాహనదారులు వాగు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు దీనికి లో లెవెల్ వంతెనను పలుమార్లు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది గత ఏడాది భారీ వర్షాలకు రోడ్డు మార్గం తెగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

గ్రామస్తుల ఇబ్బందులను పరిష్కరించాలి

నవ్వుల వాగు ఉప్పొంగగా నీరు మొత్తం ఒకేసారి రావడంతో రోడ్డు కోతబడి కొట్టుకుపోయింది వాహన దారులు ప్రమాదాలు జరిగాయి వర్షాకాలం ముందే లో లెవెల్ నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా అధికారుల దృష్టి సాధించి పనులు పూర్తయ్యే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది

పట్టించుకోని అధికారులు

నవ్వులకుంట గత రెండు సంవత్సరాల క్రితం అతి దారుణంగా రోడ్డు కొట్టుకు పోయింది మట్టి సహాయంతో మన్మత్తులు చేసిన ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ గుంతల గుండా వాహనదారులు భయభ్రాంతులకు గురవు తున్నారు అంతేకాకుండా ఎక్కడ ప్రమాదం జరుగుతుం దోనని ఆందోళన చెందు తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *