నరేందర్
అధ్యక్షులు ఏ బి ఎస్ ఎఫ్
కాకతీయ విశ్వవిద్యాలయం .
కాకతీయ విశ్వవిద్యాలయం సమస్యలకు నిలయంగా మారిందని ఏ బి ఎస్ ఎఫ్ కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యక్షులు దూడపాక నరేందర్ అన్నారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ, గత నెలలో పోతన లేడీస్ హాస్టల్ లో పొలిటికల్ సైన్స్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఒక అమ్మాయి తలపై ఫ్యాన్ పడిందని ఆ అమ్మాయికి యూనివర్సిటీ అధికారులు ఎటువంటి న్యాయం చేయలేదని, విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఘటనపై అధికారులను ప్రశ్నించగా వారు పట్టించుకోకపోవడం బాధాకరమని, శిథిలావస్థలో ఉన్న పోతన హాస్టల్ లోని అమ్మాయిలకు వేరే హాస్టల్ కేటాయించాలని ఏబిఎస్ఎఫ్ తరఫున అధికారులు కోరామని, కానీ వారు పట్టించుకోలేదని వాపోయారు. అలాగే ఆ ఘటనను మరవక ముందే అదే పోతన హాస్టల్లో రూమ్ నెంబర్ 94 లో సీలింగ్ పెచ్చులూడి కింద పడ్డాయి. ఆ సమయంలో విద్యార్థులు ఎవరు రూమ్ లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ఘటన గురించి తెలుసుకున్న ఏ బి ఎస్ ఎఫ్ నాయకులు,వివిధ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో రిజిస్టార్ గారు అమ్మాయిలకు సమ్మక్క సారక్క న్యూ హాస్టల్ కేటాయిస్తామని తెలియజేయడంతో అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన విరమించారు. కానీ అమ్మాయిలకు కేటాయించబోయే సమ్మక్క సారక్క న్యూ హాస్టల్ కూడా ఎన్నో సమస్యలకు నిలయంగా ఉందని కనీసం సరైన సౌకర్యాలు అయినా కాంపౌండ్ వాల్, వాష్ రూమ్స్, నీరు, అమ్మాయిలకు పూర్తి భద్రత, కల్పించిన తర్వాతనే హాస్టల్ కేటాయించాలని రిజిస్టర్ గారిని యూనివర్సిటీ అధికారులను మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్, కేయూ ఇంచార్జ్ మచ్చ పవన్ కళ్యాణ్,వైస్ ప్రెసిడెంట్ హర్షం చరణ్, కార్యదర్శి బండారి పృథ్వీరాజ్, అధికార ప్రతినిధి రత్నాకర్, అలాగే వివిధ విద్యార్థి ఉద్యమ నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.