United Christmas Celebrations at Bethesta Baptist Church
బేతేస్తా బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు
హన్మకొండ, నేటిధాత్రి:
హనుమకొండ 53వ డివిజన్ లష్కర్ సింగారంలోని బేతేస్తా బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు విష్ణు రెడ్డి హాజరయ్యారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని స్థానిక నేత మట్టెడ అనిల్ ఏర్పాటు చేసిన దుస్తువులను పాస్టర్ కుటుంబ సభ్యులకు విష్ణు రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేమ, ఐక్యత, సేవ భావనలే క్రిస్మస్ సందేశమని అన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు, పాస్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
