
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ నీ కమలాపూర్ మండల బిజెపి అధ్యక్షుడు కట్కూరి అశోక్ రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా రెండవ సారి గెలిచి మోడీ మంత్రి వర్గంలో హోంశాఖ సహాయ మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన బిజెపి అధ్యక్షులు, ముఖ్య నాయకులు మంత్రిని శనివారం ఢిల్లీ లోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు అశోక్ రెడ్డి తెలిపారు.