కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలి :

– తెలంగాణ ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వాక్యాలు ఖండిస్తూ అమిత్ షాను మంత్రి వర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, టి.పి.సి.సి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు.


వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతు గత వారం రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో రెండవ స్థానంలో,దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.అమిత్ షా అంబేద్కర్ పై మాట్లాడిన మాటలకు దేశం యావత్తున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
అమిత్ షాను వెంటనే మంత్రివర్గంలో నుండీ వెంటనే భర్తరఫ్ చేయాలని కొరుతున్నప్పటికీ కనీస స్పందన లేదన్నారు..
ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్టీ వర్గాలు ఏకదాటిపైకి వచ్చి అహంకారంతో మాట్లాడిన అమిత్ షాను మాట్లాడే మాటలు ఖండిస్తున్నారన్నారు..
నేడు జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ రాయడం జరుగుతుంది..
దేశవ్యాప్తంగా అనేక ఆందోళన జరుగుతున్న మోడీ అమిత్ షాను వెనకేసుకు రావడం విడ్డూరం..
అమిత్ షా పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వేలాది మంది సమక్షంలో ధర్నా నిర్వహించడం జరిగింది..
దేవుడి తర్వాత దేవుడిగా పేదవారు అంబేద్కర్ను కొలుస్తారన్నారు..
డా. బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అవపోషణ చేసుకొని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారు..
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశంలోని ప్రజలకు అనేక హక్కులు కల్పించబడ్డాయి..
అట్లాంటి మహనీయుడిపై అమిత్ షా అహంకార పూరితమైన మాటలు మాట్లాడడం దారుణం..
ఇప్పటికే అసెంబ్లీ ఆవరణలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం..
బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగివచ్చి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలి..
బిజెపి ప్రభుత్వం దేశంలోని పేదల సంపద ఆదాని అంబానీల దోచుపెడుతుంది..
ఆదానీ 2014 సంవత్సరంలో సంపన్నుల జాబితాలో 600 పై చీలుకు ఉండి నేడు రెండవ స్థానానికి ఏ విధంగా ఏగబకారో సమాధానం లేదు..
పార్లమెంట్లో ప్రశ్నించిన 150 మంది ఎంపీలను బహిష్కరించారు..
దేశంలో నియంతృత్వ పరిపాలన చేస్తున్న బీజేపి ని రాబోవు రోజుల్లో గద్దె దించాలి..
మణిపూర్లో ప్రజలు వారి హక్కులను కోల్పోతున్న ప్రధాని మోడీ, అమిత్ షా వారి గురించి పట్టించుకోరు..
మణిపూర్ లో జరుగుతున్న వాటిపై నోరు మెదపని భారతీయ జనతా పార్టీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పు పడుతున్నాం..
ఇప్పటికైనా నరేంద్ర మోడీ దిగివచ్చి అమిత్ షాను వెంటనే భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేసారు.
స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ కు వినతి పత్రం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!