ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్ రెడ్డి.
మహబూబ్ నగర్ / నేటి దాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ..
రాజకీయాలకు అతీతంగా ప్రజానీకం మొత్తం రాహుల్ భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలిచిందని,
ప్రస్తుతం దేశంలో రెండు సిద్ధాంతాల మధ్యన సంఘర్షణ జరుగుతుందని ఒకటి భాజపా పెత్తందార్లకు దేశాన్ని కట్టబెడితే.. రెండవది కాంగ్రెస్ పార్టీ సమన్యాయ సిద్ధాంతం…
రాహుల్ పోరాటాన్ని చూసి భయపడ్డ భాజపా రాహుల్ పై దాడికి తెగబడ్డదన్నారు.
అదే క్రమంలోనే రాహుల్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాహుల్ పతాక స్థాయికి తీసుకెళ్తుంటే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఉద్దేశిస్తూ.. అవమానకరంగా మాట్లాడారన్నారు.
అమిత్ షా భారత దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పి, ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా ను హోం మంత్రి పదవి నుంచి తొలగించేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, ఓబేదుల్లా కొత్వాల్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.