– తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు
నెక్కొండ, నేటి ధాత్రి : 2024, 25 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.2,22,281 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ వాస్తవంగా కేటాయించింది రూ.1,17,528.79 కోట్లు మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు అన్నారు.తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ సమావేశం సోమవారం నెక్కొండ మండల కేంద్రంలో లింగాల మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఈసం పెళ్లి బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయరంగాభివృద్ధికి నిధులు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆర్థిక మంత్రి పదే పదే బడ్జెట్ ఉపన్యాసంలో చెప్పినా వాస్తవ బడ్జెట్‌లో అందుకు సంబంధించిన కేటాయింపులు చేయకపోగా కార్పొరేట్లకు వ్యవసాయరంగాన్ని కట్టబెట్టేందుకు పూనుకున్నదని విమర్శించారు. దేశం బాగుకు పేదలు, యువకులు, మహిళలు, రైతులు మాత్రమే కీలకమని చెప్తూ రైతులకు అనేక లాభాలు, రాయితీలు కల్పించినట్లు బడ్జెట్‌లో ప్రకటించారని పియం కిసాన్ నిధి కింద 11.8 కోట్ల మందికి సంవత్సరానికి రూ.6,000ల చొప్పున ఇస్తున్నట్లు బడ్జెట్‌లో చెప్పిన దేశంలో 14.75 కోట్ల మంది రైతులు ఉండగా వాస్తవంగా కిసాన్ సమ్మాన్ పథకం 8 కోట్ల మందికి మాత్రమేపంపిణీజరుగుతున్నదని అన్నారు. సన్న`చిన్నకారు రైతులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఫసల్‌భీమా 4 కోట్ల మందికిఉపయోగపడుతున్నదని ప్రకటించారు. వాస్తవానికి 2.85 కోట్ల మందికి మాత్రమే ఫసల్‌బీమాక్లైంలువస్తున్నాయి. అవి కూడా జరిగిన నష్టంలో 25 శాతానికి మించడం లేదని ప్రీమియంతో ఇన్సూరెన్స్ కంపెనీలు వేలకోట్లు లాభాలు అర్జించడాన్ని గమనించి తెలంగాణతో సహా 8 రాష్ట్రాలు ఫసల్‌భీమా నుండి 2000 సంవత్సరంలోనే బయటకు వచ్చాయి అన్నారు. దేశవ్యాప్తంగా 1361 మండీ (మార్కెట్‌లలో) 3 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు, అలాగే మొత్తం దేశంలో వ్యవసాయోత్పత్తుల మార్కెట్ 18 లక్షల కోట్లకు చేరి, కనీస మద్దతు ధరలు రైతులకు లభిస్తున్నట్లు బడ్జెట్‌లో చెప్పారు. ఇది ముమ్మాటికి రైతులను భ్రమలకు గురిచేసే ప్రకటన మాత్రమేనని విమర్శించారు. 18 లక్షల కోట్ల వ్యాపారంలో కనీస మద్దతు ధర లభించక రైతులు ఏటా 4 లక్షల కోట్లకు నష్టపోతున్నట్లు ఆర్థిక వేత్తలు తెలియజేశారానీ నానో యూరియా ద్వారా ఎరువుల బ్లాక్ మార్కెట్ ఆగిపోయిందని, నానో డిఏపిని తెస్తామని బడ్జెట్‌లో చెప్పారు. ఇప్పటికీ దేశానికి అవసరమైన ఎరువులలో 60 శాతం ఎరువులతోపాటు 100 శాతం పొటాష్‌ను ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం. డాలర్ విలువతో పోటీ పడి రూపాయి విలువ తగ్గడంతో ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒకవైపున ఎరువుల ధరలు పెరిగిపోతుండగా 2022`23లో రూ.2,54,841 కోట్లు సబ్సిడీ ఇవ్వగా, 2024`25 బడ్జెట్‌లో రూ.1,68,130 కోట్లకు తగ్గించారు. లక్ష కోట్లు తగ్గించి ఎరువులు అందుబాటులోకి తెచ్చామని కేంద్రం చెప్పడం హశ్యాస్పదమని విమర్శించారు.
80 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహార పథకాన్ని అమలు జరిపే ప్రభుత్వం ఆహార ధాన్యాల ఉత్పత్తిని విస్తృతంగా పెంచాలి. కానీ, ఆహార సబ్సిడీల కొరత, ఉపాధిహామి పథకం కోతతో పాటు వ్యవసాయ ఎగుమతి`దిగుమతుల వ్యాపారాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉపకరణాల ధరలు పెరిగి వ్యవసాయోత్పత్తుల ధరల తగ్గిపోతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించినట్లు 18 శాతం పంట రుణాలు, 22 శాతం దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. బడ్జెట్‌లో మార్కెట్ జోక్యం పథకం కింద కేటాయింపులే లేవు. దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల నివారణకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చూపలేదని
దేశాన్ని వ్యవసాయ దిగుమతులకు కేంద్రంగా తయారు చేస్తూ, వ్యవసాయోత్పత్తులపై కార్పొరేట్ సంస్థలకు ఆధిపత్యం కలిగే విధంగా నిధులు తగ్గిస్తున్నారని విమర్శించారు. గతంలో ఉపసంహరించుకున్న 3 నల్ల చట్టాలను మరో కోణంలో అమలు జరపడాన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణమే రుణాల మాఫీతోపాటు కనీస మద్దతు ధరలను శాస్త్రీయంగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాిండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఉండ్రాతి రాజు, అన్నమనేని రవీందర్ రావు, తోట రామమూర్తి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మాదాసి యాకూబ్ ,తదితరులు పాల్గొన్నారు.
