`ఏది అసలో.. ఏది నకిలో చెప్పలేం?
`ఉప్పులు, పప్పులు, నూనెలు అన్నీ కల్తీ లే!
`ఆహార పదార్థాలన్నీ కల్తీ మయమే!
` చాలా వరకు హోటళ్ల లో పదార్థాలు నాసిరమే!
`కుళ్ళి పోయిన కూరగాయలు తెచ్చి వండిపెడుతున్నవే?
`కుళ్ళిన మాంసం తో చేస్తున్న వంటకాలే!
`కుళ్ళి పోయినా వాటిని వేడి వేడి నాసినం నూనెలో వేసి ఇస్తున్నావే!
`నిత్యం అందరూ లోట్ట లేసుకుని తింటున్నవే!
`ఇళ్లలో చాల కుటుంబాలు వంటలు మానేశాయి!
`ఆర్డర్లతోనే భోజనాలు తెప్పించు కుంటున్నారు!
`రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ సెంటర్లే!
`అగ్గువకు అని చెప్పి అమ్ముతున్నవే?
`ధర తక్కువ అని రోడ్డు పక్కన అదే కల్తీ!
`అందుమైన హోటల్లలో తెచ్చి వడ్డీస్తున్నవీ కల్తీ ఆహారమే!
`కల్తీ లకు మన ఆరోగ్యాలకు బలి చేసుకోవడమే!
`పాడైన ఆరోగ్యాలకు చేసే వైద్యం కల్తీ లే!
`నాసినం మందులతో సాగిస్తున్న వైద్యమే!
హైదరాబాద్, నేటిధాత్రి:
కల్తీ కానిదేదీ లేదు. కల్తీ చేయకుండా వుంటున్నది అసలే లేదు. అన్నీ కల్తీనే. ఉప్పు,పప్పు, బియ్యం కల్తీనే. ఆహార పదార్దాలన్నీ కల్తీనే. కల్తీలేనిది ఇదొక్కటే అని చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. తినే పదర్దాలు, వాడుకునే వస్తువులు, సర్వం కల్తీ మయమైపోయింది. కల్తీ అనే మాట లేకుండా ఏదీ తయారు కావడం లేదు. ఆఖరుకు ఇదే అసలు అని వినడానికి మనం కూడా ఇష్టపడడంలేదు. ఎందుకంటే ప్రతీదీ కల్తీ మయంగా మారిన తర్వాత అన్నీ వస్తువుల మీద అనుమానమే నిజమైతోంది. అందుకే మనుషులే కల్తీ అవుతున్నారన్న పెద్ద పెద్ద మాటలు వినిపించే సమాజంలో బతుకుతున్నాం. మనదీ ఒక బతుకేనా కుక్కల వలే, నక్కల వలే అని సమాజంలో సామాజిక సృహ కోసం, చైతన్యంకోసం ఓ కవి చెప్పాడు. కాని దానిని మనం తినే ఆహార పదార్దాల మీద, వాడుకునే వస్తువుల మీద కూడా అన్వయించుకునే పరిస్దితి దాపురించింది. ఒకటి జనం బలహీనతలను ఆసరా చేసుకొని కంపనీలు కల్తీలు చేస్తున్నాయి. పైగా పేదరికం కూడా కల్తీని ప్రోత్సహిస్తున్నాయి. జనం సోమరి తనం కూడా కల్తీని మనకు పరిచయం చేస్తున్నాయి. అందుకే మనం కల్తీ వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నాం. కలుషితమైపోయిన వస్తువులను తింటున్నాం. కల్తీ అనే పదానికి కలుషితమైన పదానికి పెద్ద తేడా లేదు. కల్తీ జరిగినా ఆరోగ్యం పాడయ్యేదే? కలుషితమైనా అనారోగ్యం తెచ్చిపెట్టేదే. అందుకే జనం కూడ కల్తీ వస్తువులు, కలుషితమైన ఆహార పదర్ధాలని తెలిసే తింటున్నాం. ఇంతకన్నా మంచిది ఎంత ఖర్చు చేసినా దొరకదన్న నమ్మకంతోనే తింటున్నాం. తెలిసే తింటున్నాం. తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగానే తింటున్నాం. అందుకే కల్తీల సామ్రాజ్యం పెరిగిపోయింది. ఇటీవల ఆర్గానిక్ అనే పదం చాలా సార్లు వింటున్నాం.చాలా మంది చెప్పగా వింటున్నాం. ఆర్యానిక్ అనే మోసంలో కూడా మనం పడిపోతున్నాం. అసలు ఆర్గానిక్ అనేదే శుద్ద అబద్దం. దేనిలోనూ ఆర్గానిక్ అనేది వుండదు. నిజంగా ఆర్గానిక్ వ్యవసాయం సాగిస్తున్నామని ఎవరు చెప్పినా, మనం విన్నా అంతా ట్రాష్. ఎందుకంటే మొక్కలకు కావాల్సింది కార్బన్. ఆ కార్భన్ను మొక్కలకు ఎవరూ ఇవ్వాల్సిన అసవరం లేదు. ఎలా ఇచ్చినా మొక్క స్వీకరించదు. ఈ సంగతి శాస్త్రవేత్త జనం ముందుకు వచ్చి చెప్పరు. ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఎక్కడా వుండదన్న మాట వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పరు. చెబితే వారు తయారు చేసే కొత్త కొత్త వండగాలు ఏ రైతు కొనుగోలు చేయరు. ఏ కంపనీలు వాటిని ప్రమోట్ చేయరు. నిత్యం కొత్తది మార్కెట్లోకి రావాలి. ఉత్పత్తులు పెరగాలి. ఇది ఏ ప్రభుత్వమైనా చెప్పేదే. ఏ శాస్త్రవేత్త అయినా చేసేదే? అందుకే ఎవరూ చెప్పడానికి ఇష్టపడరు. శాస్త్రవేత్తలు కొత్త వంగడాలు సృష్టించి మనకు అందించకపోతే ఇప్పటికే మన దేశం ఆహర కొరతతో ఇబ్బంది పడేది. ఆకలి రాజ్యం పెరిగిపోయేది. అందువల్ల కొత్త వంగడాలు అని చెబితే ప్రజలు కూడా అవి కూడా మందుల మయమే అనుకుంటున్నారు. వాటిలో పోషక విలువలు వుండడం లేదనుకుంటున్నారు. దాంతో ఆర్గానిక్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సేంద్రీయ ఎరువులలో పంటలు పండిస్తున్నామని చెబుతున్నారు. అదంతా ఒట్టి ముచ్చట. అది కూడా కల్తీలో బాగమే. ఆర్గానిక్ అనేది చెప్పుకోవడానికి, వ్యాపారానికి మాత్రమే పనికొచ్చే కల్తీ మయమే? మొక్కైనా, మానైనా పెరగాలంటే, ఎదగాలంటే కార్పన్ కావాలి. అది జలం నుంచో, భూమి నుంచో వచ్చేదికాదు. ఇస్తే మొక్క తీసుకోదు. ప్రతి మొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారానే కార్పన్ తీసుకోవాలి. దానినే ఫోటో సింతసిస్ అంటారు. పిచ్చి మొక్కలు తప్ప, ఏ ఆహార పదార్దాల మొక్కైనా సరే దాని దిగుబడి బాగా రావాలంటే ఎరువు తప్పనిసరి. పంట కూడా సమృద్దికరంగా పండాలన్నా, చీడల బారిన పడకుండా వుండాలన్నా రకరకాలైన పురుగుమందులు వాడాల్సిందే. అమ్మోనియం, పాస్పేట్ , నైట్రోజన్ లాంటివి అందించాల్సిందే. ఎరువుల వల్ల భూములు గుళ్ల గుళ్ల ఆయ్యాయి. భూసారం తగ్గిపోయింది అనే మాటలు కూడా పచ్చి అబద్దం. భూమిలో వుండాల్సిన సారం వుంటుంది. ఆ సారం అదిక దిగుబడులకు చాలదు. ఈసంగతి చెప్పకుండా ఏ రసాయనాలు వాడకుండా, పురుగు మందులు చల్లకుండా ఆర్గానిక్ పంటలు పండిస్తున్నామని అలా కూడా మోసం చేస్తున్నారు. ఏ మొక్క అయినా సరే అది గడ్డి జాతిదైనా సరే కార్భన్ డై ఆక్సైడ్ పీల్చుకొని, ఆక్సీజన్ వదిలిపెడుతుందని తెలుసు. ందులోని కార్భన్తోనే మొక్క పెరుగుతుందని తెలుసు. కాని ఆర్గానిక్ అని చెప్పి, మందులతో కూడిన వ్యవసాయమే చేసి కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. మనం నమ్ముతున్నాం. ప్రతిదీ ఆర్గానిక్ అంటే ఎగబడి కొంటున్నాం. ఇదిలా వుంటే మనం హోటళ్లలో విషాన్ని తింటున్నాం. ఇంట్లో వంటలు వండుకోనంత బద్దకమైపోయి విషాన్ని ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకొని తింటున్నాం. ఆహ్లాదం కోసం, ఆనందం కోసం, అంటూ కాలక్షేపం, మానసిక ఉల్లాసం కోసమంటూ బైటకు వెళ్లి తింటున్న ప్రతి వస్తువు కల్తిదే. ప్రతి వస్తువు కలుషితమైనదే. ఆనారోగ్యాలను ఇచ్చేదే. ఒకప్పుడు తెలంగాణలో పానీ పూరీ అంటే కొన్ని ప్రదాన నగరాల్లో మాత్రమే వుండేది. అది కూడా ఎక్కడో అక్కడ కనిపించేది. కాని నేడు చిన్న చిన్న పట్టణాలు, పెద్ద పట్టణాలలో గల్లీ గల్లీలో పానీ పూరి బండ్లు కనిపిస్తున్నాయి. వాటి నిర్వహణతోపాటు, అందులో వాడే నాసిరకం చింత పండు, శుభ్రత లేని వాడి చేతులతో ఇచ్చే వాటిని ఆవురావురంటూ తింటున్నారు. జీర్ణకోశ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజీ అంటే అదేంటని చర్చించుకునే వాళ్లు. ఎక్కడో ఒక్కడాక్టర్ వుండేవారు. పెద్దగా పని లేని డాక్టర్ అనుకునే వారు. కాని ఇప్పుడు ఇతర స్పెషలైజేషన్ కన్నా, గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రులు పుట్టగొడుల్లా వెలిసే పరిస్దితి వచ్చింది. ఏ వ్యక్తిని కదిలించినా చెప్పే మాట ఒక్కటే. గ్యాస్ ప్రాబ్లం..దానితో గుండె జబ్బులు, బీపీలు, షుగర్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఏ ఒక్కదానితోనో బాధపడుతూ గ్యాస్‌తో కూడా కలిసే బాధపడుతున్నారు. తిన్నది అరడం లేదని? తినలేకపోతున్నానని? కడుపులో మంట అని ఇలా ప్రతి ఒక్కరు కామన్‌గా చెప్పే సమస్యగా మారింది. అలా అని ఇది చిన్న సమస్య కాదు. పెద్ద సమస్య. ప్రాణాల మీదకు తక్కువ సమయంలో తెచ్చే సమస్య. మొత్తం శరీర వ్యవస్ధ మొత్తం కుళ్లిపోయేలా చేసే సమస్య. ఇన్ని సమస్యలకు కారమౌతున్న పానీ పూరిలు, కల్తీ నూనెల్లో వేయించిన వేడి వేడి కలుషితమైన ఆహార పదార్దాలు తినడం వల్లనే వస్తున్నాయి. అయినా ఓ గ్యాస్ గోలి వేసుకొవాలి. అసవరమైనే రెగ్యులర్‌గా కోర్సు వాడాలి. కల్తీ నూనెల్లో వేయించిన వాటిని తింటుంటారు. జనం మారరు. మోసం చేయడం వ్యాపారులు మానరు. జనానికి బద్దకం పోదు. వ్యాపారులు కక్కుర్తి పడకపోతే లాభపడరు. జనం బలహీనతలోనే ఆహార పదార్దాల వ్యాపారం సాగుతుంది. ఇప్పుడు అన్ని వ్యాపారాలకంటే అదే పెద్దదైపోయింది. అన్నింటికంటే ముఖ్యమైపోయింది. ప్రతివ్యక్తికి మొదట కావాల్సింది ఆహారమే. ఇప్పుడు అన్ని వ్పాపారాల కన్నా, ఇదే ప్రముఖమైనది. జనం జిహ్వ రుచులు చంపుకోలేరు. అలాగని ఇంట్లో ఓపికతో చేసుకోలేరు. తినాలనుకునప్పుడు కొనుక్కొవాలి. అనారోగ్యాల పాలౌతామని తెలిసిన జిహ్వకు రుచినందించాలి. కడుపు నింపుకోవాలి. ఆరోగ్యం పాడైపోతే ఆసుపత్రికిె వెళ్లాలి. అక్కడ కూడా జరిగే కల్తీ మందులతోనే వైద్యం చేయించుకోవాలి. డాక్టర్లు రాసిన మందులలో కల్తీ మందులను అంటగట్టినా తెచ్చుకోవాలి. మరో రకమైన ఆనారోగ్యం తెచ్చుకోవాలి. నోటిని అదుపులో వుంచుకోలేనప్పుడు కల్తీలైనా తినాలి. కలుషితమైనా లొట్టలేసుకొని తినాలి. దేవుడి మీద బారం వేసుకొని బతకాలి..అంతే!!
