భద్రాచలం నేటి ధాత్రి
పారెస్ట్ భద్రాచలం డివిజన్ అధికారి FDO కి వినతిపత్రం*
చర్ల మండలం దేవరపల్లి అడివిలో 2002నుండి చెట్లు నరికి మోట్లు తీసుకోని భూమిదున్నీ పోడుభూములలో పత్తి కంది నూగు పంటలు వేసుకొని సాగులో ఉన్నారు సర్వేలు కూడా అయ్యాయి కానీ పట్టాలు కాలేదు ఈ సందర్బంగా సిపిఐ ఎంయల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు నాయకుడు ముసలి సతీష్ పాల్గొని భద్రాచలం పారెస్ట్ డివిజన్ అధికారి FDO కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా FDO గారు మాట్లాడుతూ నా సర్వే ప్రకారం దేవరపల్లి గ్రామంలో 300,ఎకరములు పోడుభూమి ఉంది ఇందులో కొంత మొక్కలు పెట్టి భూమిలేని పేదలందరికి మనిషికి రెండు ఎకరములు భూమి ఇస్తానని ఆమి ఇవ్వడం జరిగింది, ఈ సందర్బంగా న్యూ డెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ మాట్లాడుతూ మొత్తం మొక్కలు పెడితే ఊరుకునేది లేదు ఊరిలో ఎవరు లేని సమయం చుసి మా భూమిలో మొక్కలు పెట్టారు వాటిని పీకేసాము మొక్కలు పీకాము అని అమాయక ప్రజలపైన నాయకుల పైన చర్ల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కేసు పెట్టిందే కాక మా భూమిలో ఉన్న పత్తిమొక్కలు పీకారు ఐన ప్రజలు ఎవరిని ఇబ్బంది చెయ్యలేదు కానీ మళ్ళీ JCB తెచ్చి పోలీస్ లను పిలిపించి కాలువ తియ్యాలి అని అనుకున్నరు, మాకు ఇస్తాను అన్న భూమి మాకు ఇవ్వకుండా మొక్కలు పెట్టాలనీ సుస్తే రక్తంఐన చిందిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం చెంటూ కుంట భూమి కూడా పోనివ్వము అహర్నిశలు కష్టపడి చెమటోడిసి రూపాయలు రూపాయలు కూడబెట్టి దుక్కి దున్నీపంట వేస్తే ఇన్ని సవత్సరాల లేనిది ఇప్పుడు ఒచ్చి మొక్కలు పెడితే సిపిఐ ఎంయల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు ఉదృతం చేస్తాం అని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో తులసి ముత్యాలక్క రమేష్ నాగరాజు రామకృష్ణ రమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు