సహకార బ్యాంకు ఆధ్వర్యంలో దశాబ్ది డిపాజిట్ పథకం

# దశాబ్ది డిపాజిట్ పథకాన్ని సద్వినియోగ చేసుకోవాలి.
నర్సంపేట,నేటిధాత్రి :

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సహకార కేంద్ర బ్యాంకులో దశాబ్ది డిపాజిట్ పథకం పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించినట్లు
జిల్లా కేంద్ర బ్యాంక్ నోడల్ అధికారి స్రవంతి తెలిపారు.తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యమై సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గురువారం మండలoలోని మహమ్మదాపురం, నాచినపల్లి పిఎసిఎస్ కార్యాలయాల వద్ద జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ లోని తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకానికి సంబంధించిన కరపత్రాన్ని బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కోసం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక బ్రాంచ్ మేనేజర్ కె నరేందర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సహకార కేంద్ర బ్యాంకు లోని దశాబ్ది డిపాజిట్ పథకాన్ని ప్రారంభించిందని, బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులకు అత్యధిక వడ్డీ రేటుతో కాల పరిమితిని బట్టి బ్యాంకు ఖాతాదారునికి చెల్లించబడతాయని ఆమె పేర్కొన్నారు. అత్యధికంగా ఐదు లక్షల వరకు డిపాజిట్ సౌకర్యం. నెలవారితోపాటు మూడు నెలలకు ఒకసారి వడ్డీ సౌకర్యం కల్పించబడిందన్నారు. ఈ అవకాశం సెప్టెంబర్ ఒకటి నుండి 2024 డిసెంబర్ 31వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని నల్లబెల్లి డిసిసిబి బ్రాంచ్ పరిధిలోగల మండలాల ప్రజలు సద్వినియోగం పరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రమేష్, ఖాతాదారులు గోవర్ధన్, స్వామి , సంజీవరెడ్డి, అనిల్,రాజు,సురేందర్, ప్రకాష్, సాంబయ్య,ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!