రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో.

Red Cross

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో..
వెంకటాపూర్ (ఆర్ )లో
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం..

రామాయంపేట మే 8 నేటి దాత్రి (మెదక్):

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ రోనాల్డ్ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామంలో ఉన్న నిరుపేద ప్రజలందరికీ ఆరోగ్యం అందించే దిశగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తాము అన్ని పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఒకప్పుడు జిల్లాల్లో అక్కడక్కడ శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవలు అందించే వారమని ఇప్పుడైతే ప్రతి గ్రామంలో కూడా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు.

 Red Cross
Red Cross

అనంతరం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దేమె యాదగిరి మాట్లాడుతూ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మెగా వైద్య శిబిరాలతో పాటు, రక్త దాన శిబిరాలు, వివిధ రకాల వ్యాధులకు సంబంధించి క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు… ఆరోగ్య శిబిరాల చైర్మన్ దామోదర్ రావు మాట్లాడుతూ మల్లారెడ్డి ఆసుపత్రి సౌజన్యంతో విరివిగా మెగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులను ఇస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా
కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మద్దెల సత్యనారాయణ,మద్దెల రమేష్,సభ్యులు వి.సతీష్ రావు,తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి సూరారం డాక్టర్ లు రాఘవేందర్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, మేఘాన, రవి కిరణ్ లు రోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!