
Kathalapur MPDO.
కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో
నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రధాన రహదారి నుండి మాడల్ స్కూల్ వరకు మంజూరు అయిన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కథలాపూర్ ఎంపీడీఓ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ రహదారి కోసం ప్రభుత్వం రూ. 1.30 కోట్లు మంజూరు. చేసిందని, భూమి పూజ చేసి 8 నెలలు గడిచినా పనులు ప్రారంభించలేదన్నారు. మోడల్ స్కూల్,కస్తూరిభా స్కూల్, జూనియర్ కళాశాల కు ఈ. దారిలో వెళ్లే విద్యార్థులకు వర్షం కురిసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనులు వెంటనే ప్రారంబించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి,గాంధారి శ్రీనివాస్,ఎగ్యారపు జలందర్, గడ్డం జీవన్ రెడ్డి,ప్రసాద్,కాసోజి ప్రతాప్ బీజేపీ నాయకులుపాల్గొన్నారు.