సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిరిసిల్ల సాహితి సమితి కార్యనిర్వాహణలో ఘనంగా వేడుకలు జరిగినది. సాహితి సమితి అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జ్యోతిరావు పూలే అని జ్యోతిరావు పూలే భావితరాలకు ఆశ కిరణం అనిజ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సాహితీ సమితి కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, కవి రచయిత జుకంటి జగన్నాధం, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సిరిసిల్ల సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపురి బుచ్చయ్య, గుండెల్లి వంశీ, ఎండి ఆఫీజ్, గజ్జెల్లి సత్యనారాయణ, అంకారపు రవి,కవులు రచయితలు పాల్గొన్నారు.