
Dr. C. Narayana Reddy
రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సినారె జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం ఆధ్వర్యంలో కవి, రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి 94వ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కవులు పుష్పాంజలి ఘటించడం జరిగినది. సిరిసిల్ల రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండ రవి మాట్లాడుతూ హనుమాజీ పేటలో జన్మించి, సాహిత్యపూల తోటలో విరబూసి ఆలిండియా కే గర్వకారణం తెచ్చిన సిరిసిల్ల ముద్దుబిడ్డ సినారే జ్ఞానపీఠం పురస్కారం తెచ్చిన మహాకవి అని తెలిపారు. అలాగే రచయితల సంఘం ఉపాధ్యక్షులు బూర దేవానందం సి.నారాయణ రెడ్డి పై కవిత గానం చేశారు. ఉపాధ్యక్షులు వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ సినారే సిరిసిల్లలో రాబోయే నూతన కవులకు ఒక దిక్సూచి అని తెలిపారు. అంతేకాకుండా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ సినారే సిరిసిల్లలో జన్మించడం మా సిరిసిల్ల కే గర్వకారణమని తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రముఖ కవులు ఎలాగొండ రవి, బుర దేవానందం, వెంగళ లక్ష్మణ్,చిటికెన కిరణ్ కుమార్ ఆడేపు లక్ష్మణ్,అంకారపు రవి, గుండెల్ని వంశీ, అల్లే రమేష్ కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.