Hope Foundation 151st Weekly Annadanam in Sherilingampalli
హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో.. 151వ వారం అన్నదాన కార్యక్రమం….
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
హోప్ పౌండేషన్ చైర్మన్ కొండ విజయ్‌కుమార్ ఆద్వర్యంలో హుడాకాలనీలోని హోప్పాండేషన్ కార్యాలయం వద్ద ప్రతి శనివారం అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారంతో 151 వారానికి చేరుకుంది.

ఈ సంధర్భంగా సుమారు 2500 మంది పేదప్రజలు పాల్గొని అన్నసమారాధన గావించారు. ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి కడుపునిండ భోజనం చేస్తున్నామని పలువురు పేద ప్రజలు తెలిపారు. రోజంతా కష్టపడితేగాని పూటగడవదు, కాని ప్రతి వారం ఇక్కడ మాత్రం ఉచితంగా భోజనం లభిస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోప్ ఎ ండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
