నర్సంపేట,నేటిధాత్రి :
మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు నర్సంపేట పట్టణంలోని నెహ్రూ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐక్యవేదిక కో కన్వీనర్ తడుగుల విజయ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ రజనీకిషన్,టిపిసిసి మెంబర్ పెండెం రామానంద్,ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు,కో కన్వీనర్ దళిత రత్న కల్లేపల్లి ప్రణయదీప్ హాజరై మాట్లాడుతూ సమాజంలో అణిచివేతకు, అవకాశాలకు దూరమై కుల వివక్షతను ఎదుర్కొనే దళిత బహుజన వర్గాలకు ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆనాటి సమాజంలో విద్య నేర్చుకోవడం కొన్ని వర్గాలకే పరిమితం, సమాజంలో మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు అంటరానితనం మహిళలు విద్యకు దూరం ఉండడం ఎక్కువ గా ఉండేది, వీటన్నిటి నిర్మూలన కు విద్య నేర్చుకోవడం ఒకటే మార్గమని మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు భావించి విద్యా వ్యాప్తికి జీవితాంతం కృషి చేశారు అని అన్నారు.సమాజంలో సగభాగమైన మహిళలు విద్య నేర్చుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని తన భార్య సావిత్రిబాయి పూలే మహిళా విద్యాభివృద్ధికి వినలేని కృషి చేసిందని అన్నారు. పూలే చూపిన మార్గం ప్రతీ ఒక్కరూ అనుసరిస్తూ సమాజ నిర్మాణంలో భవిష్యత్తు తరాలకు జ్యోతిరావు పూలే దంపతుల జీవిత చరిత్రలు తెలియజేయాలని ఆయన చేసిన కృషిని మరువలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక కో కన్వీనర్ దళిత రత్న గుంటి వీర ప్రకాష్, ప్రజా సంఘాల నాయకులు జనగాం కుమారస్వామి, ఎల్లన్న, పంజాల రాజు సదానందం, ప్రభుత్వ ఉపాధ్యాయులు పెండెం భాస్కర్ రఘుపతి, కాసుల రవీందర్, గిరి గాని శ్రీనివాస్ బోయిని నారాయణ, డి.ఎస్.పి నాయకులు, మరియు శ్రీకాంత్, రాజు యాదవ్ ఆబోతు రాజు, తదితరులు పాల్గొన్నారు.