మాయా ప్రపంచపు మైనింగ్‌ రాజ్యం!

https://epaper.netidhatri.com/view/207/netidhathri-e-paper-12th-march-2024/2

`క్వారీ లొక జనసంచారం లేని కీకారణ్యం.

`గ్రానైట్‌ పేర వ్యాపారుల బోజ్యం.

`గ్రానైట్‌ తవ్వకంలో అడ్డూ అదుపులేని ఉల్లంఘనలు.

`పివోటి చట్టం తుంగలో తొక్కారు.

`అమాయక పేద రైతును ముంచుతున్నారు.

`తవ్వకాల పుణ్యమా! అని ఎలగందుల చెరువే ఆగం.

`కొన్ని శతాబ్దాలుగా మంచినీరందించే చెరువు ఆనవాలే మాయం.

`పర్యావరణ కాలుష్యం… దుమ్ముతో చెరువు పూడిన వైనం.

`రైతును మోసం చేసి, జనాలను అనారోగ్యాలకు గురిచేసి…

`రాజ్యమేలుతున్న మాఫియా.

`గ్రానైట్‌ అక్రమాల దునియా.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మాయా ప్రపంచపు మైనింగ్‌ రాజ్యం. అవును మైనింగ్‌ వ్యాపారం అనేది ఒక మాయా లోకమే..అందులోనూ గ్రానైట్‌ తవ్వకాల ప్రపంచం యమలోకమే.. ఆ క్యారీల పుణ్యమా? కూలికోసం, ఆకలి కోసం, కుటుంబం కోసం, పని కోసం నాలుగు మెతుకుల కోసం ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి పనిచేసేవారు కొందరైతే, క్వారీల పక్కన వున్న స్ధలాలు తెలిసీ, తెలియక వ్యాపారుల చేతిలో పెట్టి జీవితాలు ఆగం చేసుకొనేవారు కొంత మంది. ఒక్కసారి భూములను చుట్టపక్కల రైతులు వారి చేతుల్లో పెట్టారంటే ఇక అంతే సంగతులు. అయినా మళ్లీ, మళ్లీ రైతులు మోసపోతూనే వున్నారు. ఇక క్వారీ అన్నది ఒక జన సంచారం లేని కీకారణ్యం. అక్కడ ఏం జరుగుతుందో నరమానవుడికి కూడా తెలిసే అవకాశం లేదు. అందులో పనిచేసేవారు తప్ప, ఆ క్వారీలను ఎవరూ తొంగి చూడలేరు. చూసి బతకలేరు. అక్కడికి తెలిసో, తెలియక వెళ్లినా ప్రాణాలతో తిరిగి రాలేరు. పనులు జరుగుతున్న సమయంలో జరిగే ప్రమాదాలు కోకొల్లలు. అందులో మరణించేవారు ఎంతో మంది. కాని అందులో పనిచేసేవారు ఎవరో? ఎవరికీ తెలియదు. వాళ్లు బతికున్నారా? లేరా? అన్నది ఎవరీ తెలియందు. ఒక రకంగా దట్టమైన అడువుల్లోకి ఎవరూ వెళ్లలేరు. మైనింగ్‌ అంతా కళ్లముందు కనిపించినా, అక్కడికి ఎవరూ చేరుకోలేరు. అక్కడ ప్రాణాలు కోల్పోయే వారెవరో కూడా ప్రపంచానికి తెలియదు. ఇలా ప్రాణాంకమైన, ప్రమాదరకమైన వ్యాపారాలు. అలా కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాలు సాగించేవారు ప్రాణాలతో చెలగామాడే జీవితాలు గడిపినా, వారికి జీతాలు అంతంత మాత్రమే. అందేది అత్తెసరు లాభమే. కాని లాభాల్లో వాట అన్నది వుండదు. బోనస్‌ అనేది ఏమిటో కూడా ఆ కార్మికులకు తెలియదు. వెట్టి చాకిరీ కన్నా అద్వాహ్నం. అంత నరం. కార్మికుల జీవితం.

గ్రానైట్‌ పేరిట వ్యాపారుల బోజ్యం.
అడ్డూ అదుపు లేని తవ్వకాలు. నిబంధనల ఉల్లంఘనలు. పిఓటి చట్టం తుంగలో తొక్కుతారు. అమాయకులకు లేనపోని ఆశలు చూపిస్తారు. సంతకాలు చేయించుకుంటారు. కొంత కాలం వారిని వారికి బోగాలు చూపిస్తారు. చివరికి నిండా ముంచేస్తారు. వాళ్ల భూములను కూడా ఆక్రమిస్తారు. పేదల జీవితాలతో ఆడుకుంటారు. ఏ పెద్ద నాయకుడు ఆ సామాన్యులకు సాయ పడరు. మద్దతంతా మైనింగ్‌ వాళ్లకే ఇస్తారు. వారిని మరింత పెద్దోళ్లను చేస్తారు. వారి నుంచి నాయకులు కమీషన్లు తీసుకుంటారు. అవసరాల కోసం వారిని ఏటిఎంలుగా వినియోంచుకుంటారు. వ్యాపారానికి అవసరమైన రైతులను మోసం చేస్తారు. ఎప్పటిప్పుడు లక్షలకు లక్షలు కావాలని పీడిరచే నాయకులకు సాయపడుతుంటారు. ఇది ఎలా నైతికత అవుతుందో అర్దం కాదు. అయితే చట్ట పరంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నాయకులు న్యాయం చేస్తారన్న ఆశలో వారికి ముడుపులు అందిస్తుంటారు. ఇదే సమయంలో అధికారులు కూడా పూర్తి స్దాయిలో మైనింగ్‌ వ్యాపారులకే సహకరిస్తారు. కింది స్ధాయి అధికారుల నుంచి పై స్ధాయి దాకా మైనింగ్‌ వ్యాపారులకే కొమ్ముకాస్తారు. వాళ్లిచ్చే ఆమ్యామ్యాలకు ఆశపడుతుంటారు. సామాన్యులకు చుక్కలు చూపిస్తారు. తమకు అన్యాయం జరిగిందని సామాన్యుడు కనీసం పోలీస్‌ స్టేషన్‌ మెట్టు కూడా ఎక్కలేరు. ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరు. అధికారులను న్యాయం చేయమని అడగలేదు.
తహసిల్ధార్‌ స్ధాయి నాయకుల ముఖం చూడలేరు.

అంతగా అధికార యంత్రాంగం ప్రజలకు దూరమైంది. సామాన్యులకు న్యాయం మృగ్యమైంది. సమాజంలో మంచితనం అన్నదానికి చోటు లేకుండాపోయింది. దాంతో సాగు చేసుకుందామంటే సరైన ఆదాయం రాక, జీవితాలు గడవక, కనీసం పూట గడిచే దిక్కులేక, ఎంతో కొంత జీవితం బాగుపడుతుందని నమ్మి, వారి ఆశలకు పొంగిపోయి ఒక్కసారి భూములు వ్యాపారుల చేతికిస్తే ఇక అంతే సంగతులు. ఆ భూములు జన్మలో రైతుల చేతుల్లోకి రావు. ఒక వేళ వచ్చినా ఆ భూములు సాగుకు అసలే పనికిరాదు. ఇలా వుంటుంది గ్రానైట్‌ వ్యాపారులతోటి. నిజానికి మైనింగ్‌ వ్యాపారులే కాదు, ఇతర ఏ వ్యాపారులైనా సరే అసైండ్‌ భూములు కొనుగోలు చేయడం తప్పు. కాని చట్టానికి తెలిసే పిఓటి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. అసైండ్‌ భూములు ఎట్టి పరిస్ధితుల్లో ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన చట్టాలున్నాయి. అయినా వాటిని ఎవరూ పట్టించుకోరు. కఠినంగా అమలు చేయరు. అయితే పిఓటి లాంటి చట్టాలున్న సంగతి సామాన్యులకు తెలియదు. అంతేందుకు ఉన్నత విద్యావంతులు, సమాజంలో చైతన్యవంతులైన వారికి కూడా ఇలాంటి విషయాల మీద పెద్దగా అవగాహన వుండదంటే అతిశయోక్తి కాదు. ఇదిలా వుంటే మైనింగ్‌ వ్యాపారుల ఇష్టారాజ్యం పుణ్యమా! అని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎలగందులలో వున్న చెరువు నాశనమైంది. ఒకప్పుడు ఎలగందుల చెరువుకు ఎంతో ప్రత్యేకత వుంది. ప్రకృతి సిద్దంగా ఏర్పాటైన ఓ చిన్న చెరువును కాకతీయ కాలంలో ఎలగందుల రాజ్యానికి అసవరమైన సాగు,తాగు నీటి అవసరాలు తీర్చేంత పెద్ద చెరువు తయారు చేశారు. దాదాపు ఏడు శతాబ్ధాలుగా ఆ చెరువు ఉమ్మడి కరీంనగర్‌లో మంచినీటి సరస్సుగా విరాజిల్లుతూ వుండేది. కాని నేడు ఎలగందుల చెరువు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఓ దశాబ్ధం క్రితం వున్న చెరువు పరిస్దితి ఇప్పుడు లేదు. మైనింగ్‌ వచ్చే దుమ్యూ, ధూళి ఇతర వ్యర్ధాలతో చెరువు నిండిపోయింది.

మంచి నీటి కొలను కాస్త ముందు మురికి కూపంగా మారిపోయింది.
ఇప్పుడు చెరువు ఆనవాలును కూడా కోల్పోయే స్ధితికి చేరుకుంటున్నది. కాని పాలకులు ఎవరూ పట్టించుకోకపోవడంలో ఆంతర్యం అందిరికీ తెలిసిందే. పాలనలో భాగస్వాములైన వాళ్లే ఆ వ్యాపారాలలో వున్నప్పుడు వారిని అడ్డుకునేవారు ఎవరు? మైనింగ్‌లను ఆపేసేవారు ఎవరు? గ్రానైట్‌ తవ్వకాలకు అడ్డుపడేది ఎవరు? మొత్తం పాలక స్ధానంలో వున్న నాయకగణమే పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. కొన్ని వందల శతాబ్దాల పాటు ప్రజల దాహర్తిని తీర్చిన చెరువులో చక్క కూడా చేరే పరిస్థితి లేకుండాపోతోంది. జనానికి నీటి కరువు వచ్చింది. అటు రైతులను మోసం, ఇటు పర్యావరణం దెబ్బతీసి, ప్రజల ఆరోగ్యాలను నాశనం చేసి, గ్రానైట్‌ తవ్వకాలు జరిపి, వ్యాపారుల వేల కోట్లకు అధిపతులౌతున్నారు. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గ్రానైట్‌ మాఫియా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. కరీంనగర్‌ ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఒక రకంగా అక్రమాలకు నిలమైన దునియాగా మారిపోతోంది. ఆరోగ్యం సరిగ్గాలేని, ఆహారం సరిగ్గా అందని దునియా అవుతోంది. ఒక్క గ్రానైట్‌ తవ్వకం వల్ల ఎన్ని జీవితాలు చిద్రమౌతున్నాయి. ఎంత మంది జీవితాలు వెలుగుతున్నాయి? పిడికెడు మంది వ్యాపారుల వెలుగుల కోసం, లక్షల మంది జీవితాలు బలిచేస్తున్న వ్యాపారాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తే చాలనుకుంటున్నారు. అసలు ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టడం ఎందుకు? మళ్లీ బాగు చేస్తున్నట్లు ప్రచారం చేసుకొని రాజకీయం చేసుకోవడం ఎందుకు? వ్యాపారం అంటే ఒకప్పుడు న్యాయం ధర్మంగా సాగేవి. ఇప్పుడు అన్యాయం రాజ్యమేలితే గాని వ్యాపారం చేసుకోలేమని తేలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!