ఇంకా ఖరారు కానీ నీటి విడుదల షెడ్యూల్
యాసంగికి ఎస్సారెస్పీ నీళ్లు వచ్చేనా?
ఆందోళనలో రైతులు
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఎస్సారెస్పీ నీరు వరప్రదాయని మారిన శ్రీరామ్ సాగర్ నీటి విడుదల ప్రశ్నార్ధకంగా మారిం ది ఈ ఖరీఫ్ సీజన్ లో నీటి విడుదల కోసం రైతులు ఎదు రుచూస్తున్నారు. నీటి విడు దల అనే విషయం ఎవరు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతు లు ఆందోళనలు చెందుతు న్నారు ముఖ్యంగా ఎస్సారెస్పీ నీటిపై రైతాంగం ఆధారపడి ఉంటుంది నీటి విడుదల షె డ్యూల్ కోసం ఎదురుచూ స్తున్న రైతులు ఈ యాసంగి శ్రీరాoసాగర్ ఎస్సారెస్పీ పరిధి లోని ఇప్పటివరకు షెడ్యూలు ఖరారు కాకపోవడం వల్ల రైతు లు అయోమయంలో ఉన్నారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో యాసంగి డిసెంబర్ తోలి వారంలోనే షెడ్యూల్ విడుదల చేయగా రైతులు విత్తనం నాటు కొన్నా రు కొంతమంది ఎస్సారెస్పీ నీటి కోసం ఎదురుచూస్తు న్నారు ఒకవేళ నీటిని విడుదల చేయదలుచుకుంటే షెడ్యూలు విడుదల చేయాలని లేని పక్షంలో నీటి విడుదల ఉండ దని ప్రకటించాలని రైతులు కోరుతున్నారు

గతేడాది యాసంగిలో నీళ్లు అందక నష్టపోయాం
గతేడాది యాసంగిలో 2.20 ఎకరాల వరి, మొక్కజొన్న సాగు చేసిన సకాలంలో నీళ్లు అందకపోవడంతో పంట మొ త్తం ఎండిపోయి తీవ్రంగా నష్ట పోయాం ఈసారైనా అధికా రులు స్పందించి సకాలంలో నీళ్లు అందించాలని రైతులు కోరుతున్నారు
సాగుకు ఎస్సారెస్పీ నీళ్లు అందించాలి
బేర్గుసతీష్ శాయంపేట మండల రైతు
ఎస్సారెస్పీ కాలువ నీళ్లపై ఆధారపడి వ్యవసాయ సాగు చేస్తున్న గతేడాది ఎస్సారెస్పీ నీళ్లు సకాలంలో రాలేదు 8 ఎకరాల్లో నాలుగు ఎకరాలు వరి నాలుగు ఎకరాలు మొక్కజొన్న విత్తుకోవడం జరిగింది నీళ్లు లేక ఎండిపో యి పశువులకు మేత పాలైం ది. రైతుకు 16 లక్షల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోవడం కాబ ట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగానే నీళ్లను అందిం చాలి.
