
Government rules
అనుమతి లేని నిర్మాణాలు ఆకాశ హార్మోనులు
అవినీతికి అలవాటు పడ్డ అధికారులు
గంగవరం మండలంలో సమాచారం ఇచ్చిన కూడా అక్రమ కట్టడాలపై స్పందన కరువు ఈ నిర్లక్ష్యం ఎందుకు?
గంగవరం(నేటి ధాత్రి) జూలై 30:
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మండలం గంగవరం మండలం గంగవరంలో అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వ నియమాల
ను ఉల్లంఘించి కడుతున్న అక్రమ కట్టడాలపై వార్తా కథనాల రూపంలో అధికారులకు సమాచారం ఇస్తున్న కూడా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు, గ్రామపంచాయతీ పరిధిలో 10 అడుగులు ఎత్తుకు మించి నిర్మాణం చేయకూడదని ప్రభుత్వ నియమాల్లో ఉండగా అందుకు అతిక్రమించి అడ్డు అదుపు లేకుండా ఐదు ఫ్లోర్లు కమర్షియల్ కొరకు నిర్మాణం గుండు బావి దగ్గర నుంచి
పలమనేరు- మదనపల్లి జాతీయ రహదారి కి ఇరువైపుల అక్రమ కట్టడాలు
కూర్నిపల్లి రోడ్డు వరకు చేస్తున్నారు, ఒకరిని చూసి ఒకరు నిర్మాణం జరుగుతుంటే తమకు ఏమీ తెలియదు అంటూ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు పరిమితమయ్యారు గంగవరం పంచాయతీ కార్యదర్శి వివరణ ఇస్తూ తమకు
వొత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే అక్రమ కట్టడాలు కట్టిన వారికి నోటీసులు కూడా ఇచ్చామని ఆయన తెలిపారు,
మరి నోటీసులు ఇస్తే సరిపోతుందా? అక్రమ కట్టడాలు ఏం చేయాలనుకుంటున్నారు, అనే దాని పైన కూడా సందేహాలు వస్తున్నాయి, ప్రభుత్వ అధికారులు ఇందులో చేతివాటం ఏమైనా ఉందా లేదా స్థానిక అధికార పార్టీ నాయకులు చేతివాటం చూపించారా అనేదానిపై కూడా అనేక సందేహాలు వస్తున్నాయి, ఏది ఏమైనా కానీ ప్రభుత్వ నియమాల
ను ఉల్లంఘించి అక్రమ కట్టాలని నిర్మిస్తున్న వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోకుంటే రాబోవు రోజుల్లో కమర్షియల్ రాజ్యం అవుతుందని స్థానికులు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు..