తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల ట్రాక్టర్ అసోసియేషన్ ఓనర్స్ డ్రైవర్స్ అందరు కలిసి మంత్రి కేటీ రామారావుకి తమ మద్దతు అని తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినారు ఇట్టి సమావేశ తీర్మానకార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు బోల్లి రామ్మోహన్ వచ్చిన సందర్భంగా ట్రాక్టర్ అసోసియేషన్ ఓనర్లు డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీ రామారావుకి మేమందరం కలిసి ఆయనకే గెలుపుకి కృషి చేస్తామని ఆయనకు పూర్తి సంపూర్ణ మద్దతిస్తున్నామని ఏకగ్రీవ తీర్మానం చేసి స్థానిక అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పాలకవర్గ సభ్యుల సంతకంతో కూడిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని రాష్ట్ర నాయకుల కు తీర్మాన పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి చావు దగ్గర దాక వెళ్లి తెలంగాణ సాధించారని అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు మన సిరిసిల్ల నియోజకవర్గం వర్గాన్ని ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారని మన నియోజకవర్గ అంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో స్థానిక నియోజకవర్గ ప్రజలు గమనించి ఎవరు అభివృద్ధి చేస్తారో వారికే ఓటేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్లీ మన బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని మూడోసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఓనర్లు డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు