రెంటల్ సపోర్ట్ చట్టం–2026 బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం…

రెంటల్ సపోర్ట్ చట్టం–2026 బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
టాస్క సిరిసిల్ల శాఖ హర్షం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని టాస్క్ ఆధ్వర్యంలో పే రెంటల్ సపోర్ట్ చట్టం–2026 బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడంపై టాస్క రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా డే కేర్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ, ఈ చట్టం సమాజంలో తల్లిదండ్రుల పట్ల బాధ్యతను పెంచే కీలక నిర్ణయమని తెలిపారు.
సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి సి. రామరాజు, ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ, ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, గాద మైసయ్య, కోశాధికారి దొంత దేవదాసు తదితరులు మాట్లాడుతూ, ఈ చట్టం ద్వారా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం సమంజసం అని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం, తల్లిదండ్రులను సంరక్షించని ఉద్యోగుల జీతం నుండి 10 నుంచి 15 శాతం వరకు కోత విధించే నిబంధనలను ప్రవేశపెట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితి కంటే ఎక్కువ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలిపారు.
ఈ సందర్భంగా వారు పురాణాలలోని శ్రవణ కుమారా కథను ఉదాహరణగా పేర్కొంటూ, మాతృపితృ భక్తి ప్రాముఖ్యతను గుర్తు చేశారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ సింగనయ్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, నేటి సమాజంలో తల్లిదండ్రుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు.భక్తితో కాకపోయినా భయంతో అయినా పిల్లలు తల్లిదండ్రులను సక్రమంగా చూసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడం సీనియర్ సిటిజన్ సంఘాల బాధ్యతగా భావిస్తూ, విస్తృత ప్రచారం చేపట్టాలని కోరారు.
ఈ సమావేశంలో అంకారపు జ్ఞానోభా, గజ్జెల్లి రామచంద్రం, ఖాన్ బాషా, గజవాడ కైలాసం తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version