ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే..

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!

నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో పాటు వరుస పండుగలు, సెలవులతో పనిదినాల్లో బ్యాంకులు బిజీగా మారనున్నాయి. వివిధ కారణాలతో 2026 ఏప్రిల్‌లో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి బ్యాంకుల్లో వివిధ రకాల పనులు ఉంటాయి. అందుకే ప్రతి నెల బ్యాంకులకు సంబంధించిన సెలవుల వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన హాలీడేస్ లిస్ట్ వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. అలానే కేంద్ర బ్యాంకు జాబితా ప్రకారం.. ఇవాళ(ఏప్రిల్ 1) బ్యాంకులకు సెలవు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కావడంతో ఈ సెలవును ప్రకటించారు. ఉద్యోగులు మాత్రం తమ వార్షిక ఖాతాలను మూసివేయడానికి , ఇతర ముఖ్యమైన ఆర్థిక పనులను పూర్తి చేయడానికి బ్యాంకుల్లో ఉంటారు.

కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు: కూనం

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

పోలవరానికి 1301 కోట్లు

ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5లక్షల సాయం

ఉమ్మీద్‌ పోర్టల్‌లో నూతన మాడ్యూల్స్‌

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

డిమాండ్‌ లేని సమయంలో యూనిట్‌కు 50 పైసలు రాయితీ!

నేతన్నకు ‘పవర్‌’ గిఫ్ట్‌

నేటి నుంచి నల్లమల సలేశ్వరంలో జాతర

ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాల చిత్రీకరణ

బాలుడిపై లైంగిక దాడి, వేధింపులు

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు: కూనం

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

పోలవరానికి 1301 కోట్లు

ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5లక్షల సాయం

ఉమ్మీద్‌ పోర్టల్‌లో నూతన మాడ్యూల్స్‌

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

డిమాండ్‌ లేని సమయంలో యూనిట్‌కు 50 పైసలు రాయితీ!

నేతన్నకు ‘పవర్‌’ గిఫ్ట్‌

నేటి నుంచి నల్లమల సలేశ్వరంలో జాతర

ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాల చిత్రీకరణ

బాలుడిపై లైంగిక దాడి, వేధింపులు

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

బిహు, విషు, తమిళ నూతన సంవత్సరం, అంబేద్కర్ జయంతి వంటి పండుగల కారణంగా ఏప్రిల్ 14 నుండి 16 వరకు వివిధ రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 20 మరియు 21 తేదీలలో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు కూడా తగ్గించబడతాయి. అయితే, బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ డిజిటల్ సేవలు కొనసాగుతాయి. వినియోగదారులు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా డబ్బు పంపవచ్చు లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే నేరుగా బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా సెలవులను గమనించి వెళ్లటం ఉత్తమం అని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version