సాంకేతిక యుగంలో సృష్టి ఆరంభించిన రోజు ఉగాది సందడి.

గ్రహ శాంతులను జరుపుకొని నూతన జీవితానికి శుభం పలికిన వేళా.

జీవిత సౌందర్యాన్ని అందించే ఉగాది పచ్చడి, మామిడి తోరణాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త వస్త్రాలతో కలకలలాడిన మండలం.

సహస్రనామ అభిషేకం లకు కాలేశ్వరం, మందరగిరి వెంకటస్వామి, శివ లయాల ఆలయాలు సిద్ధం.

మహాదేవపూర్ -నేటి ధారత్రి:

సమాజం సాంకేతిక రంగంలో దూసుకు వెళ్తున్న సందర్భం అయినా ఆధ్యాత్మిక విలువ దైవం ఎంత సాంకేతిక అభివృద్ధికి చెందిన దైవం ఆధ్యాత్మిక విలువలకు సమానం కాదు. మానవ సృష్టి ఆధ్యాత్మికం దైవం ఐతే సాంకేతికం అనేది మానవుని సృష్టి అందుకే సృష్టిని ప్రారంభించబడిన రోజు ఉగాది పర్వదినానికి సృష్టి ఉన్నంతకాలం సృష్టి దాతలు తలుచుకుంటూ ఉగాది సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఉమ్మడి మండలంలో ఉగాది వేడుకలను ఉమ్మడి మండల ప్రజలంతా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ప్రసిద్ధిగాంచిన కాలేశ్వర ఆలయం తో పాటు బందరగిరి వెంకటస్వామి ఆలయాల్లో ప్రత్యేక ఉగాది పర్వదిన సందర్భంగా పురస్కరించుకొని పూజలను చేయడం, అలాగే ఉగాది విశిష్టతకు సంబంధించి ప్రజలంతా ఉగాది ఆచరణాలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొని శుభాకాంక్షలు కొత్త బట్టలతో సృష్టి ఆరంభమైన దినం ఉగాదిని స్వాగతం పలకడం జరిగింది.

సాంకేతిక యుగంలో సృష్టి ఆరంభించిన రోజు ఉగాది సందడి.

ఉగాది పర్వదినానికి సృష్టి ఆరంభించడం జరిగిన రోజు కావడంతో ఇంత సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా యుగం భయం జంట ఉత్తరాయణ దక్షిణాయన యుగానికి ఆదిగా మారిన ఉగాది శతాబ్దానికి ప్రతిరూపంగా ఉగాది కావడం ఈ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత భూలోకం ఉన్నంతవరకు కొనసాగడం జరుగుతుంది. అలాంటి పర్వదినానికి మహాదేవపూర్ ఉమ్మడి మండలం అంతా ఆధ్యాత్మిక ప్రేమ విలువలతో స్వాగతం పలికిన వేళ మంగళవారం రోజు చైత్ర శుద్ధ పాండవమి నాడు వచ్చిన ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మండలమంతా పచ్చరి మామిడి తోరణాలతో కనువిందు చేసేలా ప్రతి గడప ఒక ఆధ్యాత్మిక అందాలు వెళ్లబోయడం ప్రతి ఇల్లు ఒక పవిత్ర దేవాలయాల విధముగా అలంకరణ హృదయాల్లో ఆధ్యాత్మిక విలువలను మరింత పెంచేలా చేసింది.

గ్రహ శాంతులను జరుపుకొని నూతన జీవితానికి శుభం పలికిన వేళా.

ఉగాది పర్వదినం అంటే ఒకే రోజు పండుగ సంబరం కాకుండా వారం రోజుల ముందు నుండే ఉమ్మడి మండలంలోని ఉగాది సంబరాలను ప్రారంభించుకోవడం జరిగింది. సృష్టి ఆరంభమైన పవిత్ర రోజు ఉగాది కావడం గృహాలు శుభ్రపరచడం నుండి మొదలుకొని గృహప్రవేశాలు రంగోలి తోపాటు మండలంలోని ప్రజలు సూర్యోదయానికి ముందే మేలుకొని సాంప్రదాయ నూనె స్నానాలు కొత్త బట్టల శ్రీకారం తో ఉగాది పండుగకు సిద్ధం కావడం ప్రారంభమైంది. ఉగాది పర్వదినానికి ప్రత్యేకంగా గ్రహ శాంతి పూజ మానవ జీవితంలో అవసరమయ్యే అనేక అవసరాలను సస్యశ్యామలంగా కొనసాగింపుటకు గృహ శాంతి పూజ ఒక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా ఉగాది రోజు సాధారణ జీవితం నుండి మొదలుకొని అనేక దుష్ట శక్తులను తమ కుటుంబానికి దరిచేరకుండా కాపాడుటకు ప్రధాన పూజ గృహ శాంతి కావడంతో మండలంలోని అనేక ప్రజలు పవిత్ర ఉగాది సందర్భంగా కుటుంబం పిల్లలు వ్యాపారం ఆరోగ్యం ధనం దుష్ట శక్తులకు దరి చేరకుండా గృహ పూజలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

జీవిత సౌందర్యాన్ని అందించే ఉగాది పచ్చడి, మామిడి తోరణాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త వస్త్రాలతో కలకలలాడిన మండలం.

సృష్టి ఆరంభమైన రోజు ఉగాది పలు పూజ కార్యక్రమాలతో పాటు ప్రధాన సంస్కృతిలో భాగంగా ఉగాది పచ్చడి యొక్క విలువ అటు ఆధ్యాత్మికంగా మానవ జీవితానికి కూడా ఒక సౌందర్యాన్ని అందించడంలో ప్రధాన పాత్ర కావడం అలాగే ఈ పచ్చడి జీవితంలోని అన్ని భావనాలను చెప్పే భావం ఇందులో ఇమ్మడి ఉండడం కూడా ఒక ప్రత్యేకత ఉగాది పచ్చడి. వేప పువ్వు తో మొదలుపెట్టి చివరికి కారం సహకారంతో అనేక రుచికరమైన పదార్థాలతో ఈ పచ్చడి యొక్క విశిష్టత జీవితానికి ఒక సౌందర్య రహస్యమే అని కూడా అంటారు అలాగే మామిడి తోరణాలు ఉగాది పచ్చడి కొత్త వస్త్రాలతో మహదేవ్పూర్ మండలం అంతా ఉగాది సంబరాల్లో మునిగిపోవడం జరిగింది. ఉగాది పర్వదినం రోజు మండలంలోని ప్రతి ఇంట్లో ఉగాది పచ్చడి స్వాగతం ఇస్తూ బంధువులు స్నేహితులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఉగాది ఆకుపచ్చ సంబరాలను అంబరాలు అంటించేలా జరుపుకోవడం జరిగింది.

సహస్రనామ అభిషేకం లకు కాలేశ్వరం, మందరగిరి వెంకటస్వామి, శివ లయాల ఆలయాలు సిద్ధం.

ఉగాది ప్రత్యేకత యావత్ సృష్టిని ప్రారంభించడం ఒక పవిత్రమైన రోజు కావడం ప్రత్యేకంగా ఉగాది వేడుకల్లో ఆధ్యాత్మిక విలువలను భక్తి శ్రద్ధలతో ఉగాది వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ కావడంతో మహాదేవపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఉగాది ప్రత్యేక పూజలకు ప్రజలంతా బారులు తీరడం జరిగింది. ప్రసిద్ధిగాంచిన కాలేశ్వరం ఆలయంతోపాటు మంగళగిరి వెంకటస్వామి ఆలయం శివ లయాలకు సంబంధించి దేవాలయాల్లో సహస్రనామ అభిషేకాలకు ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయాల్లో హాజరు కావడం జరిగింది. ప్రత్యేక పూజ కార్యక్రమాలు వచ్చిన భక్తులకు అభిషేకాలు అలాగే ఉగాది పచ్చడి ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి మండలమంతా పవిత్ర ఉగాది సందర్భంగా గ్రామాల్లో ప్రజలు తమ గృహాల్లో ప్రత్యేక అలంకరణ ఉగాది పచ్చడి అందించడం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సృష్టిని ప్రారంభించిన ఉగాది పర్వదినానికి భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!