Udayalakshmi’s Inspiring Service
ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకం
నేటిధాత్రి చర్ల
గుంటూరుకు చెందిన నల్లూరి ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకమని వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత అన్నారు ఉదయలక్ష్మి భర్త నల్లూరి సుబ్బారావు వర్దంతి సందర్భంగా వారి కుమారులు బాబ్జి నాగార్జున లు వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం విద్యార్దులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆశాలత మాట్లాడారు ఉదయలక్ష్మి కుటుంబం మొదటి నుండి సేవాభావం కలిగి ఉండటం హర్షనీయమని పేర్కొన్నారు 1977 లో దివిసీమ ఉప్పెన సందర్భంగా ప్రాణ ఆస్దినష్టం సంభవించి సర్వం కోల్పోయిన బాదిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్ ఎస్ ఎస్ ద్వారా చర్లలో నల్లూరి సుబ్బారావు ఉదయలక్ష్మి దంపతులు నిది సేకరించారని వెల్లడించారు ఆ నిది సేకరణలో వచ్చిన నగదుతో దివిసీమలోని దీనదయాలపురం గ్రామంలో ఒక ఇంటిని నిర్మించారని తెలిపారు ఆ ఇంటిపై చర్ల స్వయం సేవకుల సహకారంతో నిర్మాణం చేపట్టినట్లు పేరు రాసి ఉందని వెల్లడించారు నాటి విదేశాంగ శాఖ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఈ నిర్మాణం ప్రారంబోత్సం చేసారన్నారు ఉదయలక్ష్మి ఇదే స్పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అబినందనీయమని అన్నారు ప్రతి ఏటా కొమరం భీం విద్యార్ది నిలయంకు వితరణ అందిస్తూ మానవత్వం చాటుకుంటుంన్నారని అన్నారు నిలయ కమిటీ సభ్యురాలు పోలిన రమాదేవి తమ పిన్ని ఉదయలక్ష్మి ద్వారా వితరణలను అందించడం అబినందనీయని ప్రశంసించారు విద్యార్దులు ఇటువంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి విద్యార్ది క్రమశిక్షణతో మెలగి తమనుతాము తీర్చిదిద్దుకోవాలని అన్నారు పట్టుదలతో చదివి జీవితంలో స్థిరపడటం ద్వారా తల్లిదండ్రులతో పాటు గురువుల కలలను సాకారం చేయాలని హితవుపలికారు ఈ కార్యక్రమంలో వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ కొమరం భీం నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు మహిళా ప్రముఖ్ బందా స్వరూప రాణి కమిటీ సభ్యురాలు పోలిన రమాదేవి లవన్ కుమార్ రెడ్డి నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు
