టు వీలర్‌ జర్నీ ట్రాప్‌..యువతులే టార్గెట్‌!?

`టూ వీలర్‌ జర్నీ ఉచ్చులో మహిళలు!

`మహిళలకు టూవీలర్‌ జర్నీ డ్రైవర్ల వల!

`టూవీలర్‌ జర్నీ ముఠాల ట్రాప్‌లో మహిళలు చిక్కుతున్నారు.

`మహిళల జీవితాలను బలి చేస్తున్నారు.

`యువకులైతే నో టు వీలర్‌ జర్నీ పికపింగ్‌.

`యువతులైతేనే టు వీలర్‌ ట్రావెలింగ్‌.

` పెద్ద ఎత్తున నగరానికి చేరుకొని యువకులు ఎంచుకుంటున్న ఉపాధి మార్గం టు వీలర్‌ జర్నీ!

`ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది యువకులు వచ్చి టు వీలర్‌ జర్నీ నడుపుతున్నారు.

`వారిపై ఎలాంటి నిఘా లేదు.

`పక్కా ప్రణాళికతోనే జరుగుతున్న వ్యవహారం!

`పోలీసుల కళ్లు గప్పి సాగుతున్న దుర్మార్గం.

`ప్రయాణం చేసే పది నిమిషాలలోనే పెరుగుతున్న పరిచయాలు.

`ట్రాఫిక్‌ జామ్‌లు కలిసివస్తున్న అవకాశాలు.

`ముందు ఎంతో వినయంగా పరిచయం చేసుకుంటారు.

`తర్వాత నేరుగా నాకే కాల్‌ చేయమని రిక్వెస్ట్‌ చేస్తారు.

`ఎంతో నమ్మకంగా కొంత కాలం వ్యవహరిస్తారు.

`ఈ మధ్య కాలంలో యువతుల బలహీనతలు తెలుసుకుంటారు.

`వారి ఆర్థిక అవసరాలను తెలుసుకుంటారు.

`తర్వాత ట్రాప్‌లో పడేస్తారు.

`నగరంలోని మహిళా ప్రైవేటు ఉద్యోగులను ట్రాప్‌లో పడేస్తున్నారు.

`మహిళలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు.

`బైటకు చెప్పుకోలేక ఎంతో మంది మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

హైదరాబాద్‌ నగరం గత పదేళ్లకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఐటి రంగం విస్తరించడంతో హైదరాబాద్‌ నగరంతో పాటు ఒకప్పుడు పల్లెలుగా వున్న శివారు ప్రాంతాలు కూడా నేడు నగరంతో భాగమయ్యాయి. ఆయా ప్రాంతాలకు ఒకప్పుడు సరైన రవాణా సౌకర్యాలు కూడా వుండేవి కాదు. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం కూడా ఇప్పుడున్న బంజారా హిల్స్‌, జూబ్లిహిల్ల్‌లో కూడా రవాణా వ్యవస్ధ అంతంత మాత్రంగానే వుండేది. ఎప్పుడైతే ఐటి రంగం విస్తరిస్తూ వెళ్లిందో అప్పటి నుంచి హైదరాబాద్‌ విపరీతంగా విస్తరించిపోయింది. ఒకప్పుడు శంషాబాద్‌ అంటే నగరానికి ఎంతో దూరం అనే పరిస్దితి వుండేది. ఇప్పుడు అదంతా నగరంలో కలిసిపోయింది. జనాభా పెరుగుతుండడంతో రవాణా సౌకర్యాలు పెరుగుతూ వచ్చాయి. నగర వాసుల అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వాలు రవాణా వ్యవస్ధను ఎంత అందుబాటులోకి తీసుకొచ్చినా ఆయా ప్రాంతాల కాలనీలకు వాహన సౌకర్యాలు ఏర్పరిచే అవకాశాలు పూర్తిగా లేదు. దాంతో ప్రైవేటు వాహన సౌకర్యాలు విపరీతంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తూ వచ్చాయి. నిజానికి రవాణ వ్యవస్ధ సేవా రంగంలో ముందు వరుసలోవుంటుంది. ప్రభుత్వాలు వాటిని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వుంటుంది. అయినా దేశంలోని అనేక పెద్ద నగరాలతో పోటీ పడేంతగా హైదరాబాద్‌ పెరిగిపోవడంతో ప్రజలు కూడా ప్రత్నామ్నాయ రవాణ సేవలు అందుబాటులోకి తెచ్చాయి. ఉన్నత వర్గాల ప్రజలు వారికి అవసరమైన కార్లు, టూవీర్లు కొనుగోలు చేసుకుంటారు. కాని నగరానికి బతుకు తెరువు కోసం వచ్చిన వారిలో కొంత మంది సొంత వాహనాలు కొనుగోలు చేసుకోలేని పరిస్ధితుల్లో కుటుంబాలు వెల్లదీస్తుంటారు. నగర జీవితం సహజంగా భార్యా భర్తలు ఇద్దరూ కష్టపడితే గాని పూట గడవని రోజులు. పైగా కాస్తో కూస్తో అధికాదాయం కలిగిన కుటుంబాలు కూడా నగరంలో ప్రైవేటు రవాణా వ్యవస్ధను వినియోగిస్తూ వస్తున్నారు. కాకపోతే పెరుగుతున్న అవసరాలు, ఖర్చులకు తగ్గట్టు ఆదాయాలు లేకపోవడంతో మధ్య తరగతి విలవిలలాడుతోంది. వారికి కొత్తగా అందుబాటులోకి వచ్చిన టూ వీలర్‌ ప్రైవేటు రవాణ వ్యవస్ధ మంచి వెసులుబాటును కల్పించింది. నగరంలోని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా, కాలనీలకైనా టూవీలర్‌ రవాణ వ్యవస్ధ మూలంగా ప్రజలకు కొంత ఊరట కలిగింది. సహజంగా నగరంలోని కాలనీల ప్రజలకు క్యాబ్‌లు వచ్చిన తర్వాత కొంత ఊరట లభించింది. కాలనీల నుంచి మెయిన్‌రోడ్డు మీదకు రావడానికి అనేక ఇబ్బందులు పడుతుండేవారు. రాత్రి వేళల్లో కాలనీలకు చేరుకోవాలన్నా అవస్ధులు పడుతుండేవారు. ఇక ఫ్యామిలీ ప్రయాణలప్పుడు ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కాకపోతే క్యాబ్‌ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాక కొంత వెసులుబాటు కలిగింది. రాను రాను క్యాబ్‌ సర్వీసులు సామాన్యులకు భారంగా మారిపోయాయి. వందల నుంచి వేల రూపాయల ఖర్చుకు చేరుకున్నది. రాత్రి వేళలల్లో ఒక్కరు ఇల్లు చేరుకోవాలన్నా, మరెక్కడికి వెళ్లాలన్నా ఖర్చు తడిసి మోపడౌతోంది. ఇలాంటి సమయంలో వచ్చిన టూ వీలర్‌ రవాణ సౌకర్యం చాలా వరకు మేలు చేసిందనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడు ఆ రవాణ సౌకర్యమే ప్రజల జీవితాలను అస్ధవ్యవస్ధం చేసే వరకు వెళ్తోందన్న కోఠోర నిజాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం వుంది.

నగరంలో ఈ టూవీలర్‌ జర్నీ వ్యవస్ధ సక్సెస్‌ కావడంతో పెద్దఎత్తున యువత దానికి ఆకర్షితులయ్యారు. దానిని ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. దీనికి విపరీతమైన డిమాండ్‌ పెరిపోతుండడంతో నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున యువత నగరానికి చేరుకొని టూ వీలర్‌ జర్నీ ఉపాది అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కాని ఈ వ్యవస్ధ వల్ల మహిళ జీవితాలు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు ఈ టూవీలర్‌ బుక్‌ ఎవరు బుక్‌ చేసుకున్నా వెంటనే వచ్చేది. కాని ఇప్పుడు దాని సర్వీసుల్లో మార్పులు వస్తున్నాయి. ఎవరైనా పురుషులు ఆ సర్వీసును బుక్‌ చేసుకుంటే కనీసం స్పందన కూడా వుండడం లేదు. ఒక వేళ మహిళలు టూవీలర్‌ సర్వీసును బుక్‌ చేసుకుంటే క్షణాల్లో వచ్చి వాలుతున్నారు. చివరికి పురుషులు కూడా లేడీస్‌ పేరు మీద టూవీలర్‌ బుక్‌ చేసుకుంటే వస్తున్నారు. వచ్చి టూవీలర్‌ పికపింగ్‌ను క్యాన్సిల్‌ చేసి తిరిగి వెళ్లిపోతున్నారే కాని, సర్వీసు ఇవ్వడం లేదు. అంటే ఇప్పటికే పరిస్దితి ఎంత దూరం వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ టూవీలర్‌ సర్వీసును మహిళలు బుక్‌ చేసుకుంటే వెంటనే వాలిపోతారు. వారిని వాహనం మీద ఎక్కించుకున్న నుంచి డ్రాప్‌ చేసే వరకు వారితో ఎంతో మర్యాదగా, హుందాగా ప్రవర్తిస్తారు. తక్కువ దూరమైతే ఫరవాలేదు కాని, కాస్త దూరమైనా సమయం ఎక్కువ అయ్యే ప్రయాణాలను అనువుగా మల్చుకుంటారు. మహిళలతో ఎంతో మర్యాదగా మాట్లాడుతూ తాము ఎంతో పేదవాళ్లమంటూ ముందు మొదలు పెడతారు. కూర్చన్న మహిళలకు తమ బాధలు చెప్పుకుంటారు. దాంతో తన ప్రయాణం పూర్తయ్యేలోపు టూవీలర్‌ నడిపే వ్యక్తి మీద సానుభూతి కలిగేంతగా తమ సమస్యలు తెలుపుతుంటారు. సహజంగా ఇప్పుడు ఈ టూవీలర్‌ రవాణా సేవను వినియోగించుకునే మహిళలు కూడా అదే తరహా జీవితాన్ని అనుభవిస్తుంటారు. దాంతో వెంటనే అయ్యో! అనే సానుభూతి ఆ వ్యక్తి మీద కలుగుతుంది. ఆ మహిళలను డ్రాప్‌ చేసే సమయంలో మేడమ్‌.. నా నెంబర్‌ ఇస్తాను.

మీకు ఎప్పుడు అవసరమైనా నా నెంబర్‌కు ఫోన్‌ చేయండి. మీరు ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్తాను. రోజూ మీరు పని చేసే చోటకు తీసుకెళ్తాను. ఈ పనిలో సగం కమీషన్‌కే వెళ్తుంది. మీకు కూడా ఇంత చార్చి పడదు. కొంత తగ్గించి ఇవ్వొచ్చు. అని చెబుతారు. దాంతో మధ్య తరగతి మహిళలకు పది రూపాయలు మిగిలినా ఏదో అవసరానికి ఉపయోగపడుతుంది కాదా? అనుకుంటారు. అలా రోజు ఎంతో కొంత మిగులుతుందని కదా? అనుకుంటారు. దాంతో సరే అని అతని నెంబర్‌ తీసుకుంటారు. ఆ సమయంలో మీరు నాకు సాయం చేసిన వాళ్లవుతారు? అంటూ బ్రతిమిలాడుకుంటాడు. ఆ మరుసటి రోజు నుంచి అతను రెగ్యులర్‌గా ఆ మహిళను తాను పనిచేసే చోటకు తీసుకెళ్లి , దిగబెడుతుంటాడు. ఇదే సమయంలో ఆ మహిళకు తెలిసిన వాళ్లకు కూడా ఇతని నెంబర్‌ ఇస్తుంది. మంచి వాడంటూ కూడా ఆ మహిళ చెబుతుంది. ఇలా కొంత కాలం పోయిన తర్వాత సహజంగా ఈ ప్రయాణంలో టూవీలర్‌ మీద కూర్చున్న మహిళలు తమ సమస్యలను కూడా పంచుకోవడం మొదలు పెడుతుంటారు. కాని తాము ఈ వ్యక్తికి తమ కుటుంబ రహస్యాలను చెబుతున్నామని మర్చిపోతారు. ఆ మహిళల ఆర్ధిక సమస్యలను తెలుసుకొని వారిని ట్రాప్‌ల పడేస్తూ మహిళల జీవితాలు ఆగం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వీటి మీద పెద్ద పర్యవేక్షణ లేదు. అసలు ఈ టూవీలర్‌ నడిపే వ్యక్తులకు లైసెన్స్‌ వుందా? అన్నది మాత్రమే చూస్తున్నారు. కాని అతని వ్యక్తిత్వం ఎలాంటిది అని ఆ కంపనీలు చూడడం లేదు. క్యాబ్‌ల వల్ల మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న భయం నుంచి ఈ టూవీలర్‌ ఎంతో మేలు అనుకున్నవారికి ఇలాంటి సందర్భాలు ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి. ఈ మధ్య టూవీలర్‌ మీద కూర్చున్న అమ్మాయిని ఓ వ్యక్తి తాను చెప్పినట్లు వినకపోతే వెయికిల్‌ను ఏదో వాహనానికి గుద్దేస్తాను. నేను చస్తాను..నీ నువ్వు చస్తావ్‌ అని, మరో దగ్గర నేను టూవీలర్‌ వదిలేసి దూకేస్తాను. నువ్వు కిందపడి చస్తావంటూ బెదిరించిన కేసులున్నాయని తెలుస్తున్నాయి. ఇవి కాకుండా మహిళల ఆర్ధిక సమస్యలు తెలుసుకున్న తర్వాత టూవీలర్‌ జర్నీ యువకులు మహిళలను పెద్దఎత్తున వ్యభిచారం నిర్వహించేవారికి పరిచయం చేస్తున్నట్లు కూడా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు కాలేజీ అమ్మాయిలు, ఏదైనా జాబ్‌ చేసే అమ్మాయిలను మగ్గులోకి దింపి ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు నడిపి, వారిని కూడా వ్యభిచార మురికి కూపంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇలాంటి భయంకరమైన విషయాలు జరుగుతున్నా వెలుగులోకి రాకపోవడంతో అందరూ ఆ ప్రయాణం సాఫీగానే సాగుతుందనుకుంటున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్ధ పసిగట్టకపోతే సమాజం మీద పెద్ద ప్రభావం పడే ప్రమాదముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!