రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

మరణంలోనూ వీడని స్నేహం

హసన్ పర్తి / నేటి ధాత్రీ

హన్మకొండ కె యు సి పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం అనగా 01/02/2024 రాత్రి 11:30గంటలకు బొజ్జ విశ్వతేజ ఆర్/ఓ హనుమాన్ నగర్ డబ్బాలు మరియు తిప్పని సూర్యతేజ ఆర్/ఓ కోమటిపల్లి అను ఇద్దరు మిత్రులు వారి మరొక స్నేహితుడితో కలిసి రాత్రి కె యు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రముఖ కళాశాల వద్దకు వెళ్లి తిరిగి ముగ్గురు మిత్రులు కలిసి ఒకే బైక్ మీద తిరిగి ఎవరి ఇంటికి వారు వెళ్తుండగా పోలీస్ స్టేషన్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద బైక్ నడుపుతున్న వ్యక్తి అతివేగంగా నడుపుతూ బైక్ ను డివైడర్ కు తగలడంతో వెనకాలే కూర్చున్న విశ్వతేజ మరియు సూర్యతేజ ఇద్దరు ఎగిరి కింద పడడంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలై రక్తపు మడుగులో పడి ఉండడం గమనించి వారి వెనకాలే వచ్చిన మిత్రులు తిరుమల్ మరియు సుదింద్ర ఇద్దరు వారిని యం జి యం ఆసుపత్రి కి తీసుకుని వెళ్లి చికిత్స చేయిస్తుండగా మొదట విశ్వతేజ చనిపోయాడు. ఆ తర్వాత సూర్యతేజను అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రి కి తరలించగా అతను కూడా అక్కడే చనిపోయాడు. ఇద్దరు హసన్ పర్తి ఎర్రగట్టు గుట్ట దగ్గర ఉన్న కిట్స్ కాలేజీ లో బి. టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరు మరి కొద్దీ రోజుల్లో బి. టెక్ పూర్తి చేసి ఉద్యోగం సాధించి తల్లి దండ్రులకు చెదోడు వాదోడుగా ఉంటారు అనుకుంటే ఇద్దరు విద్యార్థులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రెండు కుటుంబాలలో విషాదం అలుముకుంది. బొజ్జ విశ్వతేజ తండ్రి అయినా బొజ్జ చంద్రమౌళి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె యు సి ఐ అబ్బయ్య కేసు నమోదు చేసి శవ పంచనామా చేయించడం జరిగింది. చేతికి అంద వచ్చిన కుమారులు చనిపోయిన వారి తల్లి దండ్రులను సి ఐ అబ్బయ్య ఓదార్చారు. ఈ సందర్బంగా సి ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మద్యం సేవించి కాని హెల్మెట్ లేకుండా ఎట్టి పరస్థితుల్లో ఎవరు కూడా ఎటువంటి వాహనాలు నడపరాదని తెలిపారు. తల్లి దండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *