ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్…
జహీరాబాద్ నేటి దాత్రి:
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కల్హేర్ నాయబ్ తహశీల్దార్ పవన్ కుమార్, జహీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాదిలాల్ ను సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పవన్ కుమార్ జహీరాబాద్ లో పనిచేసే సమయంలో భూమి వారసత్వ బదలాయింపు దరఖాస్తుపై సరైన విచారణ చేయనందుకు సస్పెండ్ చేసినట్లు చెప్పారు.