విద్యుత్ షాక్ తో రెండు గౌడి దున్నపోతులు మృతి.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మండలంలోని పంబాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో శాదం వెంకన్న, చింతకాయల కిరణ్ అనే ఇద్దరు రైతులకు చెందిన రెండు గౌడి దున్నపోతు (గేదే)లు గురువారం మృతి చెందాయి. బాధితులు శాదం వెంకన్న, చింతకాయల కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం గౌడి దున్నపోతులను (గేదె) సీడ్ (విత్తనం) కొరకు పెంచుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో రోజువారి లాగానే బుధవారం మేత మేయడానికి పశువుల మందలోకి తోలామని, ఉదయం పోయిన గౌడి దున్నపోతులు సాయంత్రం వరకు కూడ తమ ఇంటికి రాకపోవడంతో రాత్రంతా గౌడి దున్నపోతుల గురించి వెతికామని, అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. గురువారం ఉదయం తమ గ్రామానికి చెందిన రైతు ఎల్లముల ఐలుమల్లు పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలు తగిలి మృతి చెంది ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పశువుల వైద్యాధికారికి సమాచారం ఇవ్వగా గ్రామ పెద్దల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి, విద్యుత్ షాక్ తో గౌడి దున్నపోతులు మృతి చెందాయని నిర్ధారించి విద్యుత్ అధికారులకు నివేదిక పంపారన్నారు. శాదం వెంకన్నకు చెందిన గౌడి దున్నపోతు విలువ రూ. 1,15,000, చింతకాయల కిరణ్ కు చెందిన గౌడి దున్నపోతు విలువ రూ. 9,5000 ఉంటుందన్నారు. తమ గ్రామంలో గేదెల విత్తనం కొరకు పెంచుకుంటున్న రెండు గౌడి దున్నపోతులు మృతి చెందాయని, తద్వారా తమకు రూ . 2,10,000 ఆర్థిక నష్టం జరిగిందని, తమ బాధలు ప్రభుత్వం గుర్తించి, నష్టపరిహారం అందించి, తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!