నిండు జీవితానికి రెండు చుక్కలు

పోలియో రహీత సమాజాన్ని నిర్మిద్దాం

డా’ప్రత్యూష

గంగారం,నేటిధాత్రి:

రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని రూపుమాపుదామని గంగారం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రత్యూష అన్నారు గంగారం మండలం లో రెండో రోజు కొనసాగిన పల్స్‌ పోలియో కార్యక్రమం ఈ సందర్భంగా డా’ప్రత్యూష మాట్లాడుతూ..ఆదివారం రోజు పల్స్ పోలియో టీకా వేయుంచుకొని పిల్లలు ను గుర్తించుటకు గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని పోలియో రహిత సమాజాన్ని అందరం కలిసి నిర్మిద్దాం అని అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఆయా సెంటర్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్‌లలో ప్రజలు తప్పకుండా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఇంటింటికి తిరిగి మిగిలిపోయిన చిన్నారులకు కూడా చుక్కల మందు వేయాలని ప్రత్యూష ఆశ వర్కర్స్ ను మరియు అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో , అంగన్వాడి సిబ్బంది, ఆశ వర్కర్లు రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *