
Second Day of Pulse Polio in Kohir
రెండవ రోజున నిండు జీవితానికి రెండు చుక్కలు…!
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల్ గ్రామపంచాయతీ పరిధిలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రెండవ రోజున పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, సోమవారం నాడు కోహిర్ మండలంలోని పైడిగుమ్మల్ అంగన్వాడీ కేంద్రం, బస్టాండ్ సమీప ప్రాంతంలో వద్ద పోలియో చుక్కలు వేయించుకో లేనటువంటి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఏఎన్ఎం శాంతమ్మ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే మన అందరి లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు.