రెండు కోట్ల కళాశాల భవనం,మూడు రోజుల ముచ్చటగా మారిన వైనం.

నాసిరకం తో అంతా పగుళ్లు నేటికీ డిగ్రీ కళాశాల పరిస్థితి.

అవినీతితో కూర్కపోయి అసంపూర్తి లో డిగ్రీ కళాశాల భవనం,

పనులు పూర్తికాకముందే ఇంజనీరింగ్ అధికారి సంతకం లేకుండానే హ్యాండ్ ఓవర్ చేసిన కాంట్రాక్టర్.

భవన నిర్మాణానికి విద్యుత్ హైవే లైన్ ఆటంకం ఉందని
హైవే లైన్ పక్కకు అమర్చడంలో ఆరు లక్షల ఖర్చు చూపెట్టి చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్.

పనుల అసంపూర్తి నాసిరకం పై 2019 లొ కలెక్టర్ మరియు కమిషనర్లకు దరఖాస్తు పెట్టిన ఫలితం శూన్యం.

రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మంత్రి తక్షణమే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం.

మహాదేవపూర్ -నేటి ధాత్రి;

మారుమూల ప్రాంతంలో డిగ్రీ కళాశాల అనేక సంవత్సరాలు విద్యార్థుల కలగావుండి ఇంటర్ విద్యాభ్యాసం అనంతరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు పరిమితం కావడం ఇలాంటి పరిస్థితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008 నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతులంది అదే సంవత్సరం డిగ్రీ విద్యాభ్యాసం ప్రారంభించడం జరిగింది. ఇలా 2008 నుండి ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలలో అనేక సంవత్సరాలు విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ మండలాలకు సంబంధించిన డిగ్రీ విద్యార్థులు ప్రారంభ దశలో 500కు పైగా అడ్మిషన్లు పొంది విద్యాభ్యాసం కొనసాగిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను కొత్త డిగ్రీ కళాశాల భవనాలకు నిర్మాణం చేపట్టుటకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న మహదేపూర్ నువ్వు కూడా డిగ్రీ కళాశాల జి ప్లస్ వన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా రెండు కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన జి ప్లస్ భవనాన్ని డిగ్రీ కళాశాలకు మంజూరు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఐదు మండలాలకు సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులు తమకు కొత్త కళాశాల భవనము మంజూరై కొద్ది రోజుల్లో తాము నూతన జి ప్లస్ వసతులతో కలిగిన కళాశాలలో విద్యాభ్యాసిస్తామని ఎంతో సంతోష పడడం జరిగింది. కానీ జి ప్లస్ కళాశాల కేవలం పేరుకి పరిమితమై నేటికి అసంపూర్తి నాసిరకంతో 30% కళాశాల గదులను నిర్మాణం చేయకుండానే వదిలివేసిన దుస్థితి నేడు.

రెండు కోట్ల కళాశాల భవనం,మూడు రోజుల ముచ్చటగా మారిన వైనం.

2016లో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా డిగ్రీ కళాశాల భవనాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇదే క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మహాదేవపూర్ మండల కేంద్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల విద్యార్థులు తరగతి గదుల లేక అనేక ఇబ్బందులకు గురవుతూ స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాలలో డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల 25 లక్షలు మంజూరు చేస్తూ జి ప్లస్ భవనానికి నిధులు కేటాయించి టి ఎస్ ఈ డబ్ల్యూ డి సి విభాగానికి అందించడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ శాఖ అది సంవత్సరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో జి ప్లస్ వన్ భవనానికి నిర్మాణం కొరకు టెండర్ పిలిచి కాంట్రాక్టర్కు అప్పజెప్పడం జరిగింది. 2016లో ప్రారంభమైన డిగ్రీ జి ప్లస్ వన్ భవనం నేటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అసంపూర్తిగానే మిగిలిపోయి ఉంది. నాలుగు సంవత్సరాలు భవన నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ ఇప్పటికీ ప్రధాన ల్యాబ్ లాంటి భూములను నిర్మించకుండానే కాంట్రాక్టర్ బిల్లులు దండుకోవడం నేటికీ విద్యార్థులకు జి ప్లస్ వన్ కలగానే మిగిలిపోయింది. అసంపూర్తి భవనమే కాకుండా నాలుగు సంవత్సరాల పాటు కాంట్రాక్టర్ చేపట్టిన పనులన్నీ నాసిరకంగా చేయడం వలన ప్రస్తుత మాదాపూర్ డిగ్రీ కళాశాల భవనం గడిని తలపిస్తుంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం పనులు పూర్తి చేసినట్లు హ్యాండ్ ఓవర్ ఇచ్చి చేతులు దులుపుకోవడం విశేషం.

నాసిరకం తో అంతా పగుళ్లు నేటికీ డిగ్రీ కళాశాల పరిస్థితి.

2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల జి ప్లస్ భవనం బలవంతంగా నిర్మాణంలో సంవత్సరాలుగా జాప్యం మరోవైపు విద్యార్థులకు తరగతి గదులు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు మంచినీరు మలవిసర్జన లాంటి సమస్యలు తలెత్తుతున్న క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ 2019 జూన్ 26వ తేదీన కళాశాల నూతన భవనంలో ప్రముఖులు చేయకుండానే గత్యంతరం లేక సాదాసీదాగా అప్పటినుంచి పాల్ విద్యార్థులచే నూతన భవనంలో ప్రవేశించి తరగతులను ప్రారంభించడం జరిగింది. ఇక గత ఐదు సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాల జి ప్లస్ వన్ నూతన భవనంలో కొనసాగుతున్నప్పటికీ నేటికీ సంపూర్ణ తరగతి గదులు లేకపోవడం ఇప్పటికీ విద్యార్థులకు పరిశోధన కంప్యూటర్ లాంటి ల్యాబ్ లకు ఇబ్బంది పడక తప్పడం లేదు. మరో ప్రధాన విషయం ఏమిటంటే నిర్మించిన కళాశాల పూర్తిస్థాయి నాసిరకం పనులు చేపట్టడానికి ప్రస్తుత కళాశాలలో అనేక సాక్షాలు దర్శనమిచ్చే పరిస్థితి ఒకవైపు అసంపూర్తిగా ఉన్న తరగతి గదులతో పాటు కళాశాల లోని తరగతి గదులు గోడలు వరండాలు పరిచిన శభాష్ బండ పగుళ్ళతో బయటికి రావడం కళాశాల తరగతి గదుల ముందు కార్పెట్ లేదా శభాష్ బండకు బదులు సిమెంట్ తో ఫినిషింగ్ చేయడం వలన పూర్తిగా సిమెంట్ ఫినిషింగ్ చెడిపోయి బయటికి వచ్చి నడిచే పరిస్థితి లేకుండా ఉంది. వర్షాకాలంలో పై కప్పు కూడా పదులు వచ్చి గోడల వరకు నీళ్లు రావడం తో విద్యార్థులు కాస్త గందరగోళ పరిస్థితి కూడా ఎదురుకోవడం జరుగుతుంది. మారుమూల ప్రాంతంలో పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో రెండు కోట్ల 25 లక్షల రూపాయల నిధులను కేటాయించి అన్ని వసతులతో విద్యార్థులకు కళాశాల అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా నిధులు మంజూరు చేస్తే తూతూ మంత్రంగా నిర్మాణం చేపట్టి నాసిరకం పనులు నిర్వహించి నిధులు సరిపోలేదని అర్ధాంతరంగా నిర్మాణం పూర్తి చేయకుండానే వదిలివేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకోవడం జరిగింది.

అవినీతితో కూర్కపోయి అసంపూర్తి లో డిగ్రీ కళాశాల భవనం,

2016 17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మహదేవ్పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రెండు కోట్ల 25 లక్షల రూపాయల నిధులను జి ప్లస్ వన్ భవనా నిర్మాణానికి మంజూరు చేసి జిల్లా కలెక్టర్ సత్వర పనులకు పూర్తి చేసి విద్యార్థుల కు తక్షణ మే విద్యాభ్యాసం కొరకు అలవాటులోకి తీసుకురావాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. వండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 2016 17 ఆర్థిక సంవత్సరంలో పనులను ప్రారంభించిన సదురు కాంట్రాక్టర్ 9 సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికీ కూడా డిగ్రీ కళాశాల నేటికీ అసంపూర్తిగానే వదిలేయడం జరిగింది. నేడు సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న క్రమంలో జి ప్లస్ వన్ డిగ్రీ కళాశాల భవనంలో కంప్యూటర్ ల్యాబ్ ఎన్సిసి తోపాటు స్పోర్ట్స్ తరగతి గదులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. సంవత్సరాల కాలం గడుపుతూ పెద్ద మొత్తంలో ఉన్న నిధులను నాసిరకం పనులతో చేపట్టి ప్రశ్నించేవారు ఎవరు లేకుండా నేడు జి ప్లస్ వన్ కళాశాల వేల సంవత్సరాల గడిని తలపిస్తుంది. ఇక నాసిరకం పనుల విషయానికొస్తే జి ప్లస్ వన్ నిర్మాణం ప్రత్యక్షంగా కళాశాలను సందర్శించిన వారందరికీ కార్ ఫీట్ కి బదులు శాబాష్ బండ అది కూడా పైకి రావడం అన్ని తరగతి గదుల్లో పెద్ద మొత్తంలో పగుళ్లు ఇక్కడ కూడా మార్బల్ లాంటి బండను ఉపయోగించకుండా గ్రౌండ్ లెవెల్ అంత సిమెంట్ రుద్ది నిధులు దండుకోవడం జరిగింది.

పనులు పూర్తికాకముందే ఇంజనీరింగ్ అధికారి సంతకం లేకుండానే హ్యాండ్ ఓవర్ చేసిన కాంట్రాక్టర్.

రెండు కోట్ల 25 లక్షల జి ప్లస్ వన్ భవనము 2016లో ప్రారంభమైతే 2019 వరకు పనులు అసంపూర్తి కావడం ఇక పనులు ముందుకు సాగకపోవడంతో మరోవైపు విద్యార్థులకు తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో 2019 జూన్ లో నూతన భవనంలో ప్రవేశం చేయడం జరిగింది. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అదునుగా భావించిన కాంట్రాక్టర్ పెద్ద మొత్తంలో పలును ఉన్నప్పటికీ కళాశాలలో క్లాసులు ప్రారంభించడం కాంట్రాక్టర్కు కలిసి వచ్చింది. ఇదే సందని భావించిన కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ విభాగం సంతకం లేకుండానే ప్రిన్సిపాల్ కు బిల్డింగ్ పూర్తయిందని హైండవర్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ కు హైందవర్ చేసిన కాగితంలో మాత్రం ఫ్రంట్ వింగ్, రైట్ విన్, రేర్ వింగ్, కారీ డోర్, తోపాటు ఇతర పనులకు సంబంధించి పూర్తి చేయడం జరిగిందని నాణ్యత పరిమాణాలతో ప్రతి పనికి సంబంధించిన మెటీరియల్ వివరాలు అందించడం జరిగింది. హ్యాండ్ ఓవర్ కాగితాన్ని చూస్తే మాత్రం జి ప్లస్ వన్ భవనానికి అన్ని అంగుళాలతో సంపూర్ణంగా ఏలాంటి నాణ్యత లోపాలు లేకుండా నిర్మించి అందజేస్తున్నట్లు కాగితంలో అందించడం జరిగింది. కానీ నిర్మాణంలో మాత్రం హ్యాండ్ ఓవర్ రిపోర్టుకు భిన్నంగా సంపూర్తిగా ఉన్న వివరాలు కాలేజ్ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా నాణ్యతలేని పనులు చేపట్టి కాంట్రాక్టర్ నిధులు దోచుకోవడం జరిగిందని కండ్లకు కట్టినట్టుగా కనబడుతుంది. మరో వింత విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు ఎవరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసే రిపోర్టులో క్వాలిటీ కంట్రోల్ భవనానికి పర్యవేక్షించిన ఇంజనీరింగ్ అధికారి ఆమోదం లేకుండానే హ్యాండ్ ఓవర్ లెటర్ ను అందించడం జరిగింది.

భవన నిర్మాణానికి విద్యుత్ హైవే లైన్ ఆటంకం ఉందని
హైవే లైన్ పక్కకు అమర్చడంలో ఆరు లక్షల ఖర్చు చూపెట్టి చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్.

మహాదేవపూర్ డిగ్రీ కళాశాల ప్రాంగణము సుమారు 5 ఎకరాలకు మించి ఒక విశాలమైన అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా భూమి కలిగి ఉంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ప్రదేశంలో ప్లే గ్రౌండ్ తో పాటు ఒకవైపు కళాశాల సంపూర్ణ భవనాన్ని నిర్మించుటకు ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ కాలేజ్ ప్రాంతంలో ఉన్న 33 కెవి తోపాటు 11 కెవి 63 కెవి డీటీఆర్ ఎల్ టి లైన్లను తొలగించి నిర్మాణ పనులు చేపట్టుటకు ఇంజనీరింగ్ మ్యాపులో భవన నిర్మాణానికి విద్యుత్ తీగల అంతరాయం అని దానికి తొలగించిన అనంతరం నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని కాలేజ్ భవన నిర్మాణానికి కేటాయించిన రెండు పాయింట్ 25 కోట్ల రూపాయల గూగుల్ లో నుండి ఆరు లక్షల 85 వేల రూపాయలను వెచ్చించి విద్యుత్ తీగలను తొలగించడం జరిగిందని చెప్పుకు రావడం జరిగింది. విద్యుత్ తీగలు భవన నిర్మాణానికి ఆటంకం కలుగుతే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటిని వేరే చోటు నుండి లైను తీసేలా లేదా నిర్మాణానికి విద్యుత్ తీగల దూరంగా ఇంజనీరింగ్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ ఇలాంటి పనులు ఏమీ చేయకుండా సుమారు ప్రస్తుతం నాలుగు ఎకరాల భూమి విశాలవంతమైన మరో రెండు నుండి మూడు జి ప్లస్ భవనాలు ఇలాంటి ఆటంకాలు లేకుండా కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ విద్యుత్ లైన్ పై దృష్టి ఎందుకు వెళ్లిందో అర్థం కావడం లేదు. భవన నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత నైనా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువస్తే విద్యుత్ శాఖ 33 కెవి లైవ్ ఇతర ప్రాంతానికి మార్చేది, కానీ భవన నిర్మాణానికి కేటాయించిన నిధులను విద్యుత్ లైన్ మార్చడానికి ఉపయోగించడం కొరకు నిధులు వాడుకోవచ్చా కాంట్రాక్టర్ కావాలని విద్యుత్ లైన్ పేరుతో నిధులను పక్కదారి పట్టించడానికి కొరకే ఈ ప్రయత్నం చేయడం జరిగిందని ప్రస్తుత కాలేజీ పరిస్థితి చూస్తే వాస్తవమే కాంట్రాక్టర్ విద్యుత్ పేరుతో నిధులను పక్కదారి పట్టించడం జరిగిందని స్పష్టమవుతుంది.

పనుల అసంపూర్తి నాసిరకం పై 2019 లొ కలెక్టర్ మరియు కమిషనర్లకు దరఖాస్తు పెట్టిన ఫలితం శూన్యం.

ఒకవైపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం జి ప్లస్ వన్ కోట్ల రూపాయలతో విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వసతులు లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో జి ప్లస్ వన్ భావన నిర్మాణానికి నిధులు అందించి భావన నిర్మాణం చేసినప్పటికీ నేటికీ భవనం అసంపూర్తిగా విద్యార్థులకు అనేక ఇబ్బందులు కలుగుతున్న దృశ్య 2019లో కమిషనర్ ఆఫ్ కాలేజ్ అయ్యర్ ఎడ్యుకేషన్ తోపాటు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు డిగ్రీ కళాశాల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయిందని మరో నలభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేస్తే జి ప్లస్ భవన పనులు పూర్తి అవుతాయని కమిషనర్ ఆఫ్ ఇయర్ ఎడ్యుకేషన్ మరియు జిల్లా కలెక్టర్లకు విన్నపం కూడా చేయడం జరిగింది. కానీ నాటి నుండి నేటి వరకు కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుండి అసంపూర్తిగా ఉన్న డిగ్రీ కళాశాల భవనానికి నిధులు మంజూరు కాకపోవడం, మరోవైపు కాంట్రాక్టర్ చేసిన నిర్లక్ష్యానికి పేరుకే ఉన్న జి ప్లస్ భవనంలో కళాశాల కొనసాగడం జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మంత్రి తక్షణమే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం.

మహదేవ్పూర్ డిగ్రీ కళాశాల 2008లో ప్రస్తుతం రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కళాశాల మంజూరు చేయడం జరిగింది. కొన్ని రోజులు జూనియర్ కళాశాలలో కొనసాగిన డిగ్రీ కళాశాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మూడు రూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల్లో 33 డిగ్రీ కళాశాలలకు జి ప్లస్ వన్ భవనాల ఏర్పాటుకు రెండు కోట్ల 25 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఐటి మంత్రి శ్రీధర్ బాబు నాలుగు మండలాల విద్యార్థులకు డిగ్రీ కళాశాల సదుపాయం కలిగించినప్పటికీ పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించి అన్ని వసతులతో కూడిన భవనాన్ని ఏర్పాటు చేయాల్సిన కాంట్రాక్టర్ నిధులను దుర్వినియోగం చేస్తూ భవనాన్ని అసంపూర్తిగా వదిలేసి కట్టిన భవనాన్ని కూడా నాసిరకం పనులతో చేపట్టి నేడు వందల సంవత్సరాల భవనానికి కల్పించేలా చేసిన కాంట్రాక్టర్ అలాగే టి ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులపై తక్షణమే రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి చర్యలకు ఆదేశించి పూర్తిస్థాయి జి ప్లస్ వన్ డిగ్రీ కళాశాల భవనానికి అవసరమయ్యే 46 లక్షల నిధులను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!