చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో శివాజీ విగ్రహం వద్ద ఘటన
చందుర్తి, నేటిధాత్రి:
మంగళవారం రోజున రాత్రి 10 గంటల సమయంలో చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో మూడపల్లి గ్రామానికి చెందిన బోయిని శేఖర్ అనే వ్యక్తి సనుగుల నుండి మూడపల్లి వైపు వస్తుండగా, జోగపూర్ గ్రామానికి చెందిన ఒనగంటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి పొలం వద్ద నుండి ఇంటికి వస్తుండగా శివాజీ విగ్రహం సమీపంలో ఎదురెదురుగా బైక్ లు ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో వేములవాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు.