పత్రికా రంగానికి, జర్నలిస్టులకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి టి. కే. లక్ష్మణరావు
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి మధు
పత్రిక రంగానికి జర్నలిస్టులకు కే.లక్ష్మణరావు అందించిన సేవలు మరువలేనివని టిడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి మధు పేర్కొన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని మాక్రో. కాం కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభ లో పలువురు టిడబ్ల్యూజేఎఫ్ నాయకులతో కలిసి లక్ష్మణరావు ఫోటో కు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన లక్ష్మణరావు నాలుగు దశాబ్దాల పాటు పలు ప్రధాన పత్రికల్లో సేవలను అందించారని అదేవిధంగా జర్నలిస్టులకు సైతం పలు సేవలను చేశారని ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి సబ్బని భాస్కర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్ శ్రీనాథ్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మడ్డి వేణుగోపాల్,సభ్యులు నెల్లూరు శ్రీనాథ్,దాసరి సుధాకర్,వలస మణిరాజ్, నౌండ్ల సతీష్,కొడం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
