పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్ కార్యక్రమం
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్స్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి నడికూడ మండలంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలు, యుపిఎస్ చౌటపర్తి, యుపిఎస్ ముస్త్యాలపల్లి, యుపిఎస్ పులిగిల్ల, యుపిఎస్ నర్సక్కపల్లి నుండి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు హాజరై జడ్పీహెచ్ఎస్ నడికూడ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు వసతులు, విద్యార్థులు పరిశీలించడం జరిగింది.ఇందులో భాగంగా గ్రంథాలయం,సైన్స్ ల్యాబ్, కిచెన్ గార్డెన్,డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి ఉన్నత పాఠశాల పట్ల అవగాహన పొందినారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని ఉపాధ్యాయులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని, ఆనందాన్ని,సంతోషాన్ని పొందారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.