జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా టీవీ సత్యం
ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జగిత్యాల జిల్లా బండారి గార్డెన్లో నిర్వహించినటువంటి 18 మండలాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా టీవీ సత్యం ను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు మద్దనపల్లి జలంధర్ మాట్లాడుతూ టీవీ సత్యం మన జగిత్యాల అధ్యక్షుడు కావడం మన అదృష్టమని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని నిరుపేదలకు సబ్సిడీ ద్వారా దుగోడా మిషన్లు మరియు సంగడి మిషిన్లు విశ్వకర్మలకు ఇప్పించాలని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు మద్దనపల్లి జలంధర్ మరియు ప్రధాన కార్యదర్శి మద్దెనపల్లి నాగేష్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద దశరథం మరియు 18 మండలాల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.