Student Gifts TV to School as Tribute to Teacher
ఎంపీపీఎస్ పొత్కపల్లి (బాలికల) పాఠశాలకు టీవీ బహుమానం..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఎంపీపీఎస్ పోత్కపల్లి బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న యేబూషి సతీష్ కుమార్ యొక్క ప్రియమైన శిష్యుడు అమెరికా నుండి టీవీ ని ఎంపీపీ ఎస్ బాలికల పాఠశాలకు బహుమతిగా పంపించడం జరిగింది.దానిని మండల విద్యాధికారి రమేష్ చేతుల మీదుగా ఈరోజు తీసుకోవడం జరిగింది.ఇది గురుశిష్యుల బంధానికి ప్రతీక ఇలా ప్రభుత్వ పాఠశాలపై ఇష్టంతో గురువు పై భక్తితో టీవీ ని పంపించినందుకు పాఠశాల బృందం శిష్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రాధా రాణి, కరుణాకర్ , మిర్జా సైఫ్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
